బంపర్ ఆఫర్ కొట్టేసిన జాతిరత్నాలు హీరోయిన్….ఏకంగా ఆ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్…

ఇటీవలే రిలీజ్ అయినా జాతిరత్నాలు సినిమా కామెడీ పరంగా ప్రేక్షకులను బాగా అలరించింది.ఈ సినిమాలో నటించిన హీరోయిన్ పేరు ఫరియా అబ్దుల్లా.ఈమెను ఫరియా అబ్దుల్లా అనే కంటే జాతిరత్నాలు హీరోయిన్ అంటే యిట్టె గుర్తుపట్టేస్తారు తెలుగు సినిమా ప్రేక్షకులు.జాతిరత్నాలు సినిమాలో ఫరియా అబ్దుల్లా తన అందంతో అభినయంతో,నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.కాని ఆమెకు ఆ తర్వాత ఆఫర్లు మాత్రం అంతగా రాలేదు.

అయితే తాజాగా ఈమెకు డీ సీక్వెల్ లో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చిందని సమాచారం.ఫరియా అబ్దుల్లా కు ఈ అఫర్ గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పచ్చు.శ్రీనువైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు,జెనీలియా జంటగా నటించిన చిత్రం ఢీ బ్లాక్ బస్టర్ హిట్ అయినా సంగతి అందరికి తెలిసిందే.మంచు విష్ణు మరియు శ్రీనువైట్ల కూడా హిట్ కోసం చూస్తున్నారు.

అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయినా డీ మూవీ కి సీక్వెల్ గా డీ అండ్ డీ సినిమాలో బిజీ గా ఉన్నారు శ్రీనువైట్ల.ఢీ సినిమాలో జెనీలియా నటించిన సంగతి అందరికి తెలిసిందే.అయితే డీ సీక్వెల్ లో ఫరియా అబ్దుల్లా కు హీరోయిన్ గా చేసే అవకాశం వచ్చిందని చెప్తున్నారు.అయితే డీ సీక్వెల్ హిట్ అయితే కనుక ఫరియా అబ్దుల్లా కు అవకాశాలు క్యూ కట్టే ఛాన్స్ ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *