బాడ్మింటన్ ఆడుతూ క్రీడాకారులను ప్రోత్సహించిన ఎమ్మెల్యే ఆర్కే రోజా.

ఇటీవలే నియోజక వర్గంలో కబడ్డీ ఆడి అందరి దృష్టిని ఆకట్టుకున్న ఎమ్మెల్యే ఆర్కే రోజగారు తాజాగా బాడ్మింటన్ ఆడి మరోసారి ఆకట్టుకున్నారు.నియోజక వర్గంలో రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రీడా సంబరాలను నిర్వహించారు రొజాగారు.ఈ సందర్భంగా సోమవారం జరిగిన బాడ్మింటన్ పోటీలో రోజగారు కూడా ఆడటం జరిగింది.నగరి,పుత్తూరు మండలానికి జరిగిన ఈ బాడ్మింటన్ పోటీలో రోజా తన భర్త సెల్వమణి మరియు సోదరుడు కుమారస్వామిరెడ్డితో కలిసి బాడ్మింటన్ ఆడటం జరిగింది.

ఆ తర్వాత రొజాగారు మాట్లాడుతూ అవకాశం లేక ప్రతిభ ఉన్న చాల మంది మరుగున పడిన క్రీడాకారులు వెలుగులోకి రావడం కోసం ఈ పోటీలను నిర్వహించటం జరిగింది అని చెప్పుకొచ్చారు.ఈ పోటీలను ఇండోర్ స్టేడియం లో నగరి డిగ్రీ కళాశాలలో నిర్వహించటం జరిగింది.అండర్ 17 విభాగంలో 17 జట్లు మరియు 17 ఏళ్ళు పై బడిన విభాగంలో 48 జట్లు నగరి మండలంలో పోటీపడుతున్నాయి.

మున్సిపల్ చైర్మన్ పీజీ నీలమేఘం,రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ బాలకృష్ణన్ రాష్ట్ర రెడ్డి సంక్షేమ సంఘ డైరెక్టర్ చంద్రారెడ్డి తదితరులు ఈ పోటీల ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది.పుత్తూరు మండలంలో అండర్ 17 లో ఆరు జట్లు మరియు 17 ఏళ్ళు పైబడిన విభాగంలో 36 జట్లు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *