Home » సినిమా » బిగ్ బాస్ విజేత కంటే ఎక్కువగా..రవి పారితోషకం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే…

బిగ్ బాస్ విజేత కంటే ఎక్కువగా..రవి పారితోషకం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే…

బుల్లితెర మీద ప్రసారం అయ్యే రియాలిటీ షోలలో బిగ్ బాస్ సీజన్ 5 కు ప్రేక్షకులలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సీజన్ మొదలైన తర్వాత చూస్తూ చూస్తూనే పన్నెడవ వారం వచ్చేసింది.అయితే ఊహించని విధంగా టాప్ కంటెస్టెంట్స్ లో ఒకడిగా ఉన్న యాంకర్ రవి ఈ వారం ఎలిమినేట్ అయ్యాడు.ఇలా అకస్మాత్తుగా రవి ఎలిమినేట్ అవడంతో రవి అభిమానులు షాక్ అయ్యారు.ఈ క్రమంలో రవి కి సిరి,ప్రియాంక కంటే ఓట్లు తక్కువ ఎలా వచ్చాయో చూపించాలి అంటూ రవి అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర రచ్చ చేయడం జరిగింది.

ఇప్పుడు ప్రస్తుతం రవి ఎలిమినేట్ అవడానికి గల కారణాలు ఏంటి అని సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.ఇది ఇలా ఉంటె రవి రెమ్యూనరేషన్ గురించి కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఇలా అకస్మాత్తుగా రవి ఎలిమినేట్ అవడానికి రవి రెమ్యూనరేషన్ కూడా ఒక కారణం అన్న వార్తలు బాగానే వినిపిస్తున్నాయి.ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లలో రవి ఒక్కడే ఎక్కువ పారితోషకం తీసుకుంటున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.

రవి వారానికి ఏడు నుంచి ఎనిమిది లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట.దింతో రవి కి 12 వారాలకు 80 నుంచి 96 లక్షలు వచ్చినట్లు సమాచారం.అయితే బిగ్ బాస్ లో గెలిచినా విజేతకు అందేది 50 లక్షలు.అయితే రవి కి విజేత కంటే ఎక్కువ పారితోషకం అందడం విశేషం.ఏది ఎలా ఉన్న యాంకర్ రవి ఎలిమినేట్ కావడంతో ఆయన అభిమానులు షాక్లో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *