బుల్లితెర మీద ఇద్దరు స్టార్ హీరోలు కలిసి చేసిన సందడి ప్రసారం అయ్యేది ఎప్పుడో తెలుసా..!

బుల్లితెర మీద ప్రసారం అవుతున్న ఎవరు మిలో కోటీశ్వరులు షోకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే మధ్య మధ్యలో ఈ షో బోర్ కొట్టకుండా చాల మంది నటీనటులు వచ్చి సందడి చేయడం జరుగుతుంది.ఈ షో మొదటి ఎపిసోడ్లో చరణ్ వచ్చి పాతిక లక్షలు గెలుచుకున్నారు.ఆ తర్వాత దర్శకులు రాజమౌళి మరియు కొరటాల శివ కూడా ఎవరు మిలో కోటీశ్వరులు షోలో వచ్చి ఎన్టీఆర్ తో సందడి చేసారు.

ఇటీవలే దసరా కానుకగా హీరోయిన్ సమంత కూడా ఎవరు మిలో కోటీశ్వరులు షోలో పాల్గొని పాతిక లక్షలు గెలుచుకున్నారు.అయితే ఈ షో కు సూపర్ స్టార్ మహేష్ బాబు వస్తున్నట్లు ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది.దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయ్యినట్లు తెలుస్తుంది.కానీ ఈ ఎపిసోడ్ ప్రసారం అయ్యేది ఎప్పుడో మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు.

తాజాగా ఈ ఎపిసోడ్ ను దీపావళి కానుకగా నవంబర్ 4 న ప్రసారం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.దింతో అభిమానులలో చాల ఆసక్తి నెలకొంది.ఇప్పటికే పలువురు నటి నటులు రావడంతో భారీ టిఆర్పి రేటింగ్ దక్కించుకున్న ఎవరు మిలో కోటీశ్వరులు షో సూపర్ మహేష్ బాబు వస్తే మరింత టిఆర్పి పెరుగుతుంది.ఇక ఇద్దరు యంగ్ స్టార్ హీరోలు కలిసి ఒకే వేదిక మీద అలరిస్తే చూడడానికి కన్నుల పండుగగా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *