Home » సినిమా » భార్యను మేకప్ లేకుండా చూసి షాక్ అయినా భర్త చివరకు ఏం చేసాడంటే…

భార్యను మేకప్ లేకుండా చూసి షాక్ అయినా భర్త చివరకు ఏం చేసాడంటే…

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది.ఈజిప్ట్ కు చెందిన ఒక వ్యక్తికీ ఫేస్ బుక్ ద్వారా ఒక అమ్మాయి పరిచయం అయ్యింది.అలా రోజు చాట్ చేసుకుంటూ పరిచయం కాస్త స్నేహంగా మారింది.ఫేస్ బుక్ లో ఆ అమ్మాయి పెట్టి ఫోటోలను చూసి ఆ అమ్మాయి అందానికి ఫిదా అయ్యాడు ఆ 34 ఏళ్ళు ఉన్న ఆ వ్యక్తి.ఆ తర్వాత లైవ్ లో కూడా ఆ అమ్మాయిని చూసాడు.ఫోన్ నుంబర్లు కూడా తీసుకోని ఇద్దరు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు.ఆమె ఫోటోలను చూసి ఆమె అందానికి ఫిదా అయిపోయిన అతను ఆమెకు ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.వాళ్లిద్దరూ కలిసి చాల సార్లు బయటకు కూడా వెళ్లడం జరిగింది.

ఆమె కూడా ఒప్పుకోవడం తో ఇద్దరు కలిసి పెళ్లి కూడా చేసుకున్నారు.అయితే పెళ్లి అయినా మూడు రోజుల తర్వాత ఇద్దరు కలిసి షార్జా లోని అల్ మాంజార్ బీచ్ కి వెళ్లారు.దింతో నీటిలో ఆమె మేక్ అప్ కరిగిపోయింది.ఒక్కసారిగా భార్యను మేక్ అప్ లేకుండా చూసి షాక్ అయ్యాడు భర్త.ఇన్ని రోజులు ఆమె అందంగా కనిపించటానికి కారణం మేక్ అప్.నా భార్య అందంగా లేదు,ఇన్ని రోజులు మేక్ అప్ వేసుకొని మానేజ్ చేసింది,నాకు తను వద్దు అంటూ ఫ్యామిలీ కోర్ట్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసాడు.కోర్టు అతనిని విచారించగా….

పెళ్ళికి ముందు నుంచి ఆమె మేక్ అప్ లోనే కనిపించేది,ఒక్కసారిగా ఆమెను మేక్ అప్ లేకుండా చూసి షాక్ అయ్యాను,అయినా కూడా ఆమెతో కలిసి బ్రతకటానికి నెల రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను అంటూ తెలిపాడు.అయినా ఆమెతో కలిసి జీవించటం కష్టం,నాకు విడాకులు ఇప్పించండి అంటూ కోర్టును కోరాడు.ఎప్పుడు మేక్ అప్ తో ఉన్న ఫోటోలని పెట్టడంతో నేను మోసపోయానని అతను చెప్పుకొచ్చాడు.భర్త అలా చెప్పడంతో భార్య చాల బాధపడుతూ అందమేమి శాశ్వతం కాదు కదా అంటూ ప్రశ్నించింది.కోర్టు కౌన్సిలింగ్ ఇస్తూ ఒక సంవత్సరం కలిసి సర్దుకుపోవాలి సూచించింది.అయినా కూడా భర్త ఒప్పుకోకపోవడంతో కోర్టు విచారణను వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *