ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన బాయ్స్ చిత్రంతో సినిమా ఇండస్ట్రీ కి పరిచయమయ్యింది జెనీలియా.ఆ తర్వాత సుమంత్ కు జోడిగా సత్యం సినిమాలో నటించింది.వరుసగా అటు తమిళంలోనూ మరియు తెలుగు లోను సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయిన జెనీలియా తానూ ప్రేమించిన రితేష్ ను పెళ్లి చేసుకొని పూర్తిగా సినిమాలకు దూరమైయ్యింది.జెనీలియా చివరగా 2012 లో రానా కు జోడిగా నా ఇష్టం సినిమాలో నటించింది.ఆ తర్వాత బాలీవుడ్ హీరో అయినా రితేష్ ను వివాహం చేసుకొని ఫామిలీ తో హ్యాపీ గా జీవితం కొనసాగిస్తుంది.
అయితే జెనీలియా,రితేష్ కు మధ్య 9 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉందట.అయినా కూడా వీరిద్దరూ మంచి అండర్ స్టాండింగ్ తో తమ వైవాహిక జీవితాన్ని గడిపేస్తున్నారు.జెనీలియా తెలుగులో రెడీ,ఢీ,బొమ్మరిల్లు వంటి పలు హిట్ సినిమాలు చేసింది.జెనీలియాకు ఇద్దరు సంతానం.పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యిన జెనీలియా ఎన్ని ఆఫర్స్ వచ్చిన కూడా చేయలేదు.
పెళ్లి అయ్యి ఇన్ని సంవత్సరాలు అయినా తర్వాత తానూ మల్లి సినిమాలు చేయబోతున్నట్లు జెనీలియా చెప్పుకొచ్చింది.ప్రస్తుతం జెనీలియా రితేష్ నటిస్తున్న సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తోంది.మంచి కథ వస్తే మల్లి సినిమాల్లో నటిస్తాను అని చెప్పుకొచ్చింది జెనీలియా.జెనీలియా రీ ఎంట్రీ కోసం ఆమె అభిమానులు వేచి చూడాల్సిందే.