మహేష్,రాజమౌళి సినిమాలో విలన్ గా తమిళ్ స్టార్ హీరో…ఎవరంటే..!


భారీ బడ్జెట్ తో రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి అందరికి తెలిసిందే.పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రం జనవరి 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇప్పటి వరకు ఈ సినిమా కోసం కష్టపడిన రాజమౌళి ఆ తర్వాత మహేష్ బాబు తో చేయబోయే సినిమా పనిలో పడ్డారు.ఇప్పటికే రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.కె ఎల్ నారాయణ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

ఇప్పటికి మహేష్ బాబు మరియు రాజమౌళి కాంబినేషన్ లో రాబోయే చిత్రం కోసం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మంచి యాక్షన్ కథను రెడీ చేస్తున్నారని సమాచారం.ఇప్పటికే ఈ కథ పూర్తి అయ్యిందని కూడా వార్తలు వస్తున్నాయి.గతంలో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా హాలీవుడ్ యాక్షన్ స్టైల్ లో ఉండబోతుంది అని చెప్పడం జరిగింది.ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

యాక్షన్ సినిమా గా రూపొందుతున్న ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో అయినా విక్రమ్ విలన్ గా చేస్తే బాగుంటుందని రాజమౌళి భావిస్తున్నారట.ఇదివరకు విక్రమ్ నటించిన అపరిచితుడు మరియు ఐ సినిమా లు చుస్తే ఆయన ఒక పాత్ర కోసం ఎంతగా కష్టపడతారో చెప్పచ్చు.ఇప్పుడు ఈ సినిమా కోసం విక్రమ్ అయితే బాగుంటుంది అని రాజమౌళి మరియు విజయేంద్ర ప్రసాద్ భావిస్తున్నారని సమాచారం.ఇక రాజమౌళి అడిగితె విక్రమ్ కూడా విలన్ గా చేయడానికి ఒప్పుకోవచ్చు అనే వార్తలు కూడా సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *