కన్నడ పవర్ స్టార్ అయినా పునీత్ రాజ్ కుమార్ చిన్న వయస్సులోనే గుండెపోటుతో మరణించిన సంగతి అందరికి తెలిసినదే.అయితే ఆయన మరణాన్ని అటు ఇండస్ట్రీ కానీ ఇటు కుటుంబసభ్యులు మరియు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.ఆయన మరణ వార్త విని ఇప్పటికి సుమారు పన్నెండు మంది ఆత్మహత్య చేసుకొని మరణించారు.అభిమానులు ఇలా ఆత్మహత్యలకు పాలుపడుతుండడంతో పునీత్ భార్య అశ్విని స్పందించడం జరిగింది.పునీత్ రాజ్ కుమార్ మరణం మాకు తీరని లోటు.
మీ కుటుంబాలకు ఇలాంటి పరిస్థితి రాకూడదు.ఆయన లేరు అన్న విషయాన్నీ మేము కూడా ఇప్పటికి జీర్ణించుకోలేక పోతున్నాము.మీరందరు చూపిస్తున్న ప్రేమకు ఎప్పుడు రుణ పడి ఉంటాము అని అశ్విని తెలిపారు.ఆయన మన మధ్యలో లేకపోయినా కూడా మనందరి గురించే ఆలోచిస్తూ ఉంటారు.
దయచేసి అభిమానులు ఆత్మహత్యలకు పాల్పడి కుటుంబాలను ఒంటరిగా చేయకండి అంటూ పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని తెలిపారు.పునీత్ రాజ్ కుమార్ సోదరులు అయినా శివ రాజ్ కుమార్ మరియు రాఘవేంద్రులు కూడా అభిమానులు ఎవ్వరు కూడా అఘాయిత్యాలకు పాల్పడకండి అంటూ చెప్పడం జరిగింది.పునీత్ సోదరులు పునీత్ అంత్యక్రియల దృశ్యాలను పదే పదే ప్రసారం చేయకండి అంటూ మీడియాను విజ్ఞప్తి చేయడం జరిగింది.