వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే రొజాగారికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాల ప్రత్యేక స్తానం ఉందన్న విషయం తెలిసిందే.అటు రాజకీయాలతో పాటు,ఇటు సినిమాలు షోలతో బిజీగా ఉన్న రోజా ఆటలలో కూడా తన సత్తా చాటుతున్నారు.ఇటీవలే తన భర్త సెల్వమణికి పోటీగా కబడ్డీ కబడ్డీ అంటూ ఆడి అదరగొట్టారు రోజా.ఇటీవలే తాజాగా బాడ్మింటన్,వాలీబాల్ కూడా ఆడి విద్యార్థులను ప్రోత్సహించటంతో పాటు తన టాలెంట్ ని కూడా నిరూపించుకున్నారు.ప్రతీ ఆటలోను తనకు తిరుగులేదు అని మరొకసారి త్రో బాల్ ఆడి నిరూపించారు రోజా.
నగరి నియోజకవర్గంలో రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామీణ క్రీడా సంబరాలను నిర్వహించిన రోజగారు,ఆ క్రీడలను తానె దగ్గరుండి మరి పర్యవేక్షిస్తున్నారు.త్రో బాల్ పోటీలను అండర్ 17 మరియు 17 ఏళ్ళు పైబడిన విభాగంలో తాజాగా త్రో బాల్ పోటీలను నిర్వహించారు.ఈ పోటీలలో కాసేపు క్రీడాకారులతో సరదాగా ఆడి త్రో బాల్ స్మాష్ లు కొట్టి అక్కడున్న అందరికి ఆశ్చర్యానికి గురి చేసారు రోజా.రియల్ ప్లేయర్ లాగా త్రో బాల్ ఆడి కొన్ని పాయింట్లు కూడా గెలిచారు రోజా.
అనంతరం అక్కడున్న విద్యార్థులు రొజాగారితో కాసేపు మాట్లాడి వారి సమస్యలను కూడా వివరించారు.విద్యార్థులు రొజాగారితో సెల్ఫీ లు కూడా దిగడం జరిగింది.నియోజకవర్గంలో రోజాకు తిరుగులేదు.ఎల్లప్పుడూ నియోజకవర్గంలోనే తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాళ్లకు చేరువగా ఉంటున్నారు రోజా.రోజాతో పాటు ఆమె భర్త సెల్వమణి మరియు కుటుంబసభ్యులు కూడా ఆటలలో పాల్గొంటున్నారు.దింతో నగరి నియోజకవర్గంలో జరిగే గ్రామీణ క్రీడలు చాల సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నాయి.