వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైనా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్ తన 31 వ పుట్టిన రోజును సెలెబ్రేట్ చేసుకుంది.అయితే రకుల్ తన పుట్టిన రోజు సందర్భంగా హీరో,నిర్మాత అయినా జాకీ భగ్నానీ తో ప్రేమలో ఉన్నట్టు చెప్పిన సంగతి అందరికి తెలిసిందే.అయితే ఇటీవలే ఆస్ట్రాలజర్ అయినా వేణు స్వామి రకుల్ ప్రీత్ వివాహం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.
ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న రకుల్,జాకీ వివాహం ఎంగేజ్మెంట్ వరకు వచ్చి ఆగిపోతుందని ఒకవేళ వివాహం జరిగిన కూడా విడిపోతారని సంచలన వ్యాఖ్యలు చేసారు.జాకీ భగ్నానీ జాతకాన్ని పరిశీలించిన వేణు స్వామి ఆయనది మకర రాశి,శని దృష్టి చంద్రుడు,శుక్రుడు పై ఉండడం వలన వివాహంలో సమస్యలు తలెత్తుతాయని చెప్పుకొచ్చారు.
రకుల్ జాతకాన్ని కూడా పరిశీలించిన ఆయన మిధున రాశి కావడం వలన గురువు కేతువు కలిసి ఉండడం వలన కుటుంబంలో సౌఖ్యం ఉండదని చెప్పుకొచ్చారు.పెళ్లి జరిగిన కూడా సంతానం కలగకపోవడం,న్యాయ పరమైన సమస్యలు,కేసు పరంగా రకుల్ జైలు కు వెళ్లే అవకాశం కూడా ఉందని వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేసారు.ఇదివరకు కూడా సామ్ చైతు విషయంలో వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు నిజమైన సంగతి అందరికి తెలిసిందే.