రాకింగ్ రాకేష్ మీద ఆగ్రహంతో కొట్టబోయిన జడ్జి మనో…అక్కడ ఉన్న వాళ్లంతా షాక్…ఇంతకీ ఏం జరిగిందంటే.!

బుల్లితెర మీద ప్రసారం అయ్యే జబర్దస్త్ కామెడీ షో క్రేజ్ ను బాగా సంపాదించుకుంది.దింతో ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షో మొదలయ్యి అది కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.బుల్లితేర మీద ప్రసారం అయ్యే ఈ రెండు కామెడీ షోలు కూడా బాగా విజయవంతంగా ప్రేక్షకులను అలరించటం లో సక్సెస్ అయ్యాయి.ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటేనే ముందుగా గుర్తొచ్చేది సుడిగాలి సుధీర్,రష్మీ జంట.ఈ జంటకు ఆన్ స్క్రీన్ మీద బాగా ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి.అయితే ఇటీవలే తాజాగా నవంబర్ 5 న ప్రసారం కానున్న ఈ షో సంబంధించిన ప్రోమో ను విడుదల చేసారు జబర్దస్త్ నిర్వాహకులు.

దీనికి సంబంధించిన ప్రోమోలో వర్ష,భాస్కర్ స్కిట్లో వర్షను భాస్కర్ ట్రై చేసాడని కామెడీ పండిస్తారు.ఆ తర్వాత సుడిగాలి సుధీర్ టీం లో సుధీర్ మర్చిపోయి అమ్మాయి ప్యాంట్ వేసుకొని వచ్చాడని జడ్జి రోజా నవ్వడం జరుగుతుంది.రాకింగ్ రాకేష్ స్కిట్ అయిపోయిన తర్వాత జడ్జి సింగర్ మనో కోపంతో యెంత గౌరవం అయ్యా నువ్వంటే రాకేష్ నాకు,ఏంటిది,పద్ధతేనా అసలు,మీరు చేస్తున్నది ఏంటి అంటూ చెప్తారు.

జడ్జి మనో ఐ యామ్ సో సారీ అంటూ లేచి వెళ్ళిపోతారు.రోజా గారు మనో గారు అని పిలిచినా కూడా వినకుండా అక్కడ నుంచి దిగి వెళ్ళిఐపోతారు మనో.రాకేష్ టీం మనో గారిని ఐ యామ్ సారీ సార్ అంటూ ఆపేందుకు ప్రయత్నించినా చేయితో కొట్టబోయారు జడ్జి మనో.దింతో అక్కడ ఉన్న వారంతా షాక్ కు గురయ్యారు.మనో గారు సారీ మేడం అంటూ రోజా గారితో చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోవడం జరిగింది.అయితే ఇదంతా ప్రోమో కోసం జరిగిందా లేక అసలు విషయం ఏంటా అని తెలియాలంటే ఈ ఎపిసోడ్ ప్రసారం అయినప్పుడు చూడాల్సిందే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *