ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి హిట్ అందుకున్నారు కార్తికేయ.ఆ సినిమాలో నటన పరంగా అభిమానులకు దగ్గరయ్యారు.అమ్మాయిలలో కార్తికేయ కు మంచి ఫాలోయింగ్ కూడా ఉందని చెప్పచ్చు.తాజాగా కార్తికేయ నటించిన రాజా విక్రమార్క చిత్రం ఈ నెల అంటే నవంబర్ 12 న విడుదలకానుంది.దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను హైదరాబాద్ లో నిర్వహించారు.ఈ ఫంక్షన్లో హీరో కార్తికేయ తాను పెళ్లిచేసుకోబోతున్నాను అని చెప్తూ తనకు కాబోయే భార్యను కూడా పరిచయం చేసారు.కార్తికేయ ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు.ఆమె పేరు లోహిత.బీటెక్ లో కార్తికేయ,లోహిత కలిసి చదువుకున్నారు.
కార్తికేయ తన ప్రేమ కథ గురించి చెప్తూ బీటెక్ స్టార్ట్ అయినప్పుడు కెరీర్ గోల్స్ ఏమి ఉండవు కాబట్టి ఆ టైంలోనే లవ్ స్టోరీలు స్టార్ట్ అవుతాయి.నా ప్రేమ కథ కూడా ఆ టైంలోనే స్టార్ట్ అయ్యింది.ముందుగా లోహిత కు నేనే ప్రపోజ్ చేశాను.తన మెసేజ్ కోసం చాల ఎదురు చూసే వాడిని.తనకు గిఫ్ట్ లు కూడా ఇచ్చేవాడిని.ఇక ఫైనల్ ఇయర్ వచ్చేసరికి తాను కూడా ఓకే చేయడం జరిగింది.హీరో అవడం కోసం యెంత గా కష్టపడ్డానో తన ప్రేమ కోసం కూడా అంటే కష్టపడ్డాను అంటూ కార్తికేయ చెప్పుకొచ్చారు.నేను లోహిత కు ఫోన్ లో ప్రపోజ్ చేశాను.
ఆ టైంలోనే నేను హీరో కావాలనుకుంటున్నాను,నేను అనుకున్నది జరిగిన తర్వాత వచ్చి మీ ఇంట్లో మాట్లాడతాను అని చెప్పారట.ఇప్పుడు నేను ప్రేమించిన అమ్మాయినే నేను ఈ నెల నవంబర్ 21 న పెళ్లి చేసుకోబోతున్నాను అని తెలిపారు.అందరి ముందు తన ప్రేమ కథను చెప్పి కార్తికేయ సినిమా స్టైల్ లో మోకాళ్ళ మీద వంగి లోహిత కు ప్రపోజ్ చేసారు.కార్తికేయ అలా చేసేసరికి ఆమె కళ్ళలో ఆనంద భాష్పాలు వచ్చాయి.