రైలు పట్టాల మధ్యలో కంకర రాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా…దాని వెనుక రహస్యం ఇదే…

మీరు ఎప్పుడైనా రైలు ట్రాక్ లను బాగా గమనించారా.రైలు ట్రాక్ లను చూసినట్లయితే ట్రాక్ లకు పక్కన చుట్టూ మొత్తం కూడా కంకర రాళ్లు పరిచి ఉంటాయి.అలా కంకర రాళ్లు రైల్వే ట్రాక్ మొత్తం మరియు చుట్టూ ఎందుకు వేస్తారో చాల మందికి తెలియదు.అలా రైల్వే ట్రాక్ మీద ఉండే కంకర రాళ్లను బల్లాస్ట్ అని అంటారు.ఇదివరకు ట్రాక్ మధ్యలో చెక్క దిమ్మలు అమర్చేవారు.కానీ ఇప్పుడు ట్రాక్స్ మధ్యలో కాంక్రీట్ దిమ్మలను అమరుస్తారు.అలా ఆ చెక్క దిమ్మలు కానీ కాంక్రీట్ దిమ్మలు కానీ ఒకదానికి ఒకటి స్లీపర్స్ తో ఫిక్స్ చేస్తారు.

Advertisement

ఇలా ఫిక్స్ చేసిన తర్వాత ఆ కాంక్రీట్ దిమ్మలు మరియు పట్టాలు కదలకుండా ఒకేచోట ఉండేందుకు చుట్టూ మరియు ట్రాక్ మొత్తం కూడా కంకర రాళ్లను పోస్తారు.ఈ రైల్వే ట్రాక్ మొత్తాన్ని భూమికి కొంత ఎత్తులో చుట్టూ కంకర రాళ్ళూ పోసి దిమ్మలు మరియు ట్రాక్ కదలకుండా నిర్మిస్తారు.కంకర రాళ్లను ట్రాక్స్ పక్కన కూడా పోయడం వలన వర్షం నీరు అలాంటివి నిల్వ ఉండవు.అలాగే ట్రాక్ మొత్తం మరియు చుట్టూ కూడా కంకర రాళ్లను పోయడం వలన అక్కడ మొక్కలు అలాంటివి మొలవవు.

వరదకు కూడా ట్రాక్ కొట్టుకుపోకుండా ఉండేందుకు కూడా ఈ కంకర రాళ్లను పరుస్తారు.అలాగే ఈ కంకర రాళ్లు కాకుండా సాఫ్ట్ గా గుండ్రంగా ఉండే రాళ్లను కనుక ఉపయోగించినట్టయితే ట్రైన్ శబ్దానికి మరియు ట్రైన్ వెళ్లే బరువుకు గుండ్రంగా ఉండడం వలన అవి కూడా గుండ్రంగా తిరుగుతాయి.అందుకే ఒక ఆకారం లేని ఈ కంకర రాళ్లను పరిచినట్లయితే అవి ఒక చోట ఫిక్స్ అయ్యి ఉంది దిమ్మలు మరియు ట్రాక్ లను కూడా గట్టిగ కదలకుండా చేస్తాయి.దిమ్మలు మరియు ట్రాక్ కదలకుండా ఉండేందుకు ఈ చుట్టూ ఉండే కంకర రాళ్లు ముఖ్య పాత్రను పోషిస్తాయి.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *