Home » సినిమా » వరుసగా సినిమాలు ఓకే చేస్తున్న పెళ్లిసందD హీరోయిన్ శ్రీలీలా!

వరుసగా సినిమాలు ఓకే చేస్తున్న పెళ్లిసందD హీరోయిన్ శ్రీలీలా!

తెలుగు చిత్ర పరిశ్రమకు పెళ్లిసందD చిత్రంతో పరిచయమైనా హీరోయిన్ శ్రీలీలా.పెళ్లిసందD చిత్రం ఇటీవలే విడుదల అయ్యి మంచి వసూళ్లను సాధించింది.ఈ సినిమా శ్రీలీలా కు మంచి పేరు తెచ్చిపెట్టింది.అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన కూడా అందరి దృష్టి ఆమె వైపే ఉంటుంది.కృతి శెట్టి కూడా ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయ మయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

దాంతో కృతి శెట్టి కి వరుసగా సినిమాలు క్యూ కట్టాయి.ఇప్పుడు అదే విధంగా దర్శక నిర్మాతల దృష్టి శ్రీలీలా మీద పడిందనే చెప్పాలి.తన అందంతో,అభినయంతో మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీలా కు ఆ సినిమా విడుదలకు ముందే రవితేజ తో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.ఇటీవలే ఈ సినిమా రిలీజ్ అయినా తర్వాత నితిన్,సాయిధరమ్ తేజ్,శర్వానంద్,నిఖిల్ లాంటి హీరోల పక్కన వరుసగా సినిమాలకు నటించే అవకాశం కొట్టేసింది శ్రీలీలా.

ఇప్పటికే నాలుగు సినిమాలకు ఓకే చెప్పిన శ్రీలీలా కు మరో రెండు ఆఫర్లు కూడా వచ్చాయని వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే రిలీజ్ అయినా మొదటి సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల అంచనాలను అందుకోకపోయిన వసూళ్ల పరంగా మాత్రం దూసుకుపోతుంది.ఈ సినిమా తర్వాత శ్రీలీలా వరుసగా సినిమాలు ఓకే చేస్తూ బిజీగా అయిపొయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *