సినిమా ఇండస్ట్రీలో చాల మంది నటి నటులు తమ దగ్గర పని చేసే స్టాఫ్ ను సొంత వాళ్ళలాగా భావించి చూసుకుంటారు.ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో రామ్ చరణ్ ఒకరు.మెగా వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు రామ్ చరణ్.మొదటి చిత్రం తో ఆశించిన విజయం సాధించలేక పోయిన ఆ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన చిత్రం మగధీర తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఆ తర్వాత ధృవ,నాయక్,ఎవడు,రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు చరణ్.మెగా ఫ్యామిలీ వాళ్ళు తమ దగ్గర పని చేసే స్టాఫ్ ను సొంత వాళ్ళలాగా చూసుకుంటారు.
స్టాఫ్ ను మార్చడానికి ఇష్టపడరు.కరోనా సమయంలో కూడా తమ స్టాఫ్ ను ఏ రకమైన ఇబ్బంది పెట్టలేదని స్టాఫ్ చెప్తున్నారు.చిరంజీవి గారు ఇండస్ట్రీ కు వచ్చినప్పటి నుంచి కూడా అయన దగ్గ ఒకే మేక్ అప్ మాన్ ఉన్నాడు.స్టాఫ్ కూడా వాళ్లతో చాల నమ్మకంగా ఉంటారట.ఇటీవలే చరణ్ కార్ డ్రైవర్ జీతం గురించి సామజిక మాధ్యమాల్లో బాగానే చర్చ జరుగుతుంది.తన దగ్గర పని చేసే స్టాఫ్ కు రామ్ చరణ్ మంచి జీతం ఇస్తారట.రామ్ చరణ్ తన దగ్గర పని చేసే కార్ డ్రైవర్ కు నెలకు 45 వేలు ఇస్తున్నారని సమాచారం.
అలాగే పండుగలు వచ్చినప్పుడు బోనస్ లు కూడా ఇస్తారట రామ్ చరణ్.అయితే రామ్ చరణ్ కార్ డ్రైవర్ జీతం ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి రేంజ్లో ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం రామ్ చరణ్ పాన్ ఇండియా లెవెల్ లో వస్తున్నా ట్రిపుల్ ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రాజమౌళి తెరకెక్కిస్తున్నారు.ఆ తర్వాత హీరో రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నారు.