వేడి వేడి సూప్ ఉన్న కంటైనర్ మూత కరిగిపోవడంతో ఆ మహిళా యెంత పని చేసిందో చూడండి.!

రెస్టారంట్ లలో చాల మంది కస్టమర్లు ఆర్డర్ లేటుగా తీసుకువచ్చారానో లేక మరి ఏ ఇతర కారణం చేతనో ఆ సర్వ్ చేసే వాళ్ళ మీద ఆగ్రహాన్ని ప్రదర్శించటం మనం చూసే ఉంటాము.చాల మంది ఆగ్రహంతో ఫర్నిచర్ ను కూడా పాడు చేయడం మనం వినే ఉంటాము.కానీ ఇక్కడ ఒక మహిళా సూప్ నచ్చలేదని ఆ రెస్టారంట్ ఓనర్ మొహం మీద ఆ సూప్ విసిరేసి పారిపోయింది.ఈ ఘటన టెక్సాస్ లోని ఒక రెస్టారంట్ లో జరిగింది.వివరంగా చెప్పాలంటే…ఒక మహిళా టెక్సాస్ లోని ఒక రెస్టారంట్ లో స్పైసి గా ఉండే మెక్సికన్ సూప్ ను ఆర్డర్ చేయడం జరిగింది.

ఆమె తీసుకున్న సూప్ ఉన్న కంటైనర్ లో ప్లాస్టిక్ ముక్కలో కనిపించాయి.దింతో ఆమె కోపంతో రెస్టారంట్ ఓనర్ కు తెలియజేసింది.సూప్ ఉన్న కంటైనర్ మూత కరిగిపోయింది అంటూ ఆ రెస్టారంట్ మేనేజర్ మీద తన కోపాన్ని చూపించింది.అలా కొంచెం సేపు మేనేజర్ తో వాదించిన తర్వాత ఆ సూప్ ను ఆ మేనేజర్ మొహం మీద విసిరేసి ఆ మహిళా అక్కడ నుండి వెళ్ళిపోయింది.

దింతో షాక్ కు గురియైన ఆ మేనేజర్ ఆ మహిళా ను వెంటనే పట్టుకోవడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.అక్కడే ఉన్న కొంత మంది మహిళల సహాయం తో ఆమె వెళ్లే కార్ నెంబర్ ను ఫోటోలు తీయడం జరిగింది.ఈ ఫోటోల సహాయంతో ఆ రెస్టారంట్ మేనేజర్ పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది.ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియొ ను చూసి నెటిజన్లు ఆ కస్టమర్ చేసిన పనికి రకరకాలుగా విమర్శిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *