వైరల్ అవుతున్న ఎన్టీఆర్ వర్క్ ఔట్స్ వీడియొ.!


సినిమా ఇండస్ట్రీలో నటీనటులు తమ అందం విషయంలోనే కాకుండా ఫిట్ నెస్ విషయంలో కూడా చాల జాగ్రత్తలు తీసుకుంటారు.రోజు హెల్తీ ఫుడ్ తీసుకుంటూ,వ్యాయామాలు చేస్తూ తమ ఫిట్ నెస్ ను రక రకాలుగా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటారు నటి నటులు.ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న అభిమానుల ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.జూనియర్ ఎన్టీఆర్ కూడా తన ఫిట్ నెస్ ను కాపాడుకోవడానికి చాల కష్టపడుతూ కసరత్తులు చేస్తుంటారు.ప్రస్తుతం ఎన్టీఆర్ జక్కన్న తెరకెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

ఇక ఈరోజు విడుదల చేసిన ట్రిపుల్ ఆర్ గ్లిమ్ప్స్ సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తుందని చెప్పాలి.ఎన్టీఆర్ లుక్ ఆయన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఇప్పటికే విడుదల అయ్యిన ఎన్టీఆర్ పోస్టర్స్ వీడియొ నెట్టింట్లో బాగా హల్ చల్ చేస్తున్నాయి.తాజాగా ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమా కోసం బాగా కసరత్తులు చేస్తూ కష్టపడినా వీడియొ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో ఎన్టీఆర్ తన కాళ్లతో భారీ బరువును ఎత్తుతూ కసరత్తు చేస్తున్నారు.కొంత సేపు తర్వాత ఆ బరువు ను భరించలేక తన ఫిట్ నెస్ ట్రైనర్ సహాయం తీసుకున్నారు.దీనికి సంబంధించిన వీడియోను ఎన్టీఆర్ ఫిట్ నెస్ ట్రైనర్ తన ఇంస్టా ఖాతాలో షేర్ చేసారు.పాన్ ఇండియా లెవల్ లో ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ కానుంది.ఇక ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *