వైరల్ అవుతున్న దాక్షాయణిగా అనసూయ పుష్ప మూవీ లుక్….


స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్,రష్మిక మందాన జంటగా నటిస్తున్న చిత్రం పుష్ప షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు.పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రం తెరకెక్కబోతుంది.పుష్ప సినిమాలో సునీల్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇటీవలే రిలీజ్ చేసిన సంగతి అందరికి తెలిసిందే.ఇప్పుడు యాంకర్ అనసూయకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు చిత్ర నిర్వాహకులు.ఈ పోస్టర్ లో అనసూయ దాక్షాయణిగా పాన్ మసాలా నములుతూ చేతిలో అడ కత్తెర పట్టుకొని ఉన్నారు.ఇదివరకు కూడా సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం చిత్రంలో రంగమత్త పాత్ర లో అనసూయ కనిపించడం జరిగింది.

రంగమత్త పాత్ర అనసూయ కు మంచి పేరు తీసుకొచ్చింది.ఇప్పుడు కొత్తగా రిలీజ్ అయినా పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్ర కూడా ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచుతోంది.ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు అనసూయ.కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండం చిత్రంలో కూడా అనసూయ ఒక ఆసక్తికర పాత్రలో కనిపించనున్నారని సమాచారం.

నటసామ్రాట్ అనే మరాఠీ చిత్రంకు రీమేక్ గా వస్తున్నా ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్,రమ్య కృష్ణ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.ఇక రెండు భాగాలుగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో మొదటి భాగాన్ని క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 17 న విడుదల చేయనున్నారు.ఈ చిత్రంలో దాక్షాయణి పాత్రలో అనసూయ సునీల్ కు భార్యగా నటించడం జరిగింది.దాక్షాయణి పాత్ర నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.పుష్ప సినిమాలో అనసూయ,సునీల్ పాత్రలు కీలక పాత్రలు కానున్నాయి అని సమాచారం.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *