వచ్చే సంవత్సరం 2022 లో సంక్రాంతి పండుగకు చాల సినిమాలు పోటీపడుతున్నాయి.ఇప్పటికే ట్రిపుల్ ఆర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.అయితే కొన్ని రోజుల క్రితమే సంక్రాంతి పండుగ కానుకగా భీమ్లా నాయక్ కూడా విడుదల కానుందని ప్రకటించడం జరిగింది.కొన్ని పరిస్థితుల కారణంగా భీమ్లా నాయక్ విడుదల తేదీ మారె అవకాశం ఉందని కూడా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసాయి.రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమాకు పోటీగా భీమ్లా నాయక్ విడుదల చేయకపోవచ్చు అనే వార్తలు కూడా వినిపించాయి.
అయితే వీటన్నిటికీ చెక్ పెడ్తు సంక్రాంతి కానుకగా భీమ్లా నాయక్ కూడా విడుదల చేస్తున్నారని తెలుస్తుంది.దీనికి సంబంధించి ఇప్పటికే ప్రొడ్యూసర్ నాగవంశీ డిస్ట్రిబ్యూటర్లకు థియేటర్లను సిద్ధం చేసుకోవాలని సూచించినట్లు సమాచారం.పవన్ కళ్యాణ్ కూడా భీమ్లా నాయక్ విడుదల తేదీని మార్చవద్దని నిర్మాతలకు సూచించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే ట్రిపుల్ ఆర్ కు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చిన కూడా భీమ్లా నాయక్ కూడా సంక్రాంతికి విడుదల అవుతుండడంతో కలెక్షన్స్ పరంగా ప్రభావం చూపే అవకాశం ఉందని జక్కన్న కూడా టెన్షన్ పడుతున్నట్లు సమాచారం.రాధేశ్యామ్ చిత్రం కూడా సంక్రాంతి బరిలో ఉండడం తో థియేటర్లకు సంబంధించి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.