చాల మంది ఇల్లు నిర్మించేటప్పుడు అలాగే ఇంట్లో వస్తువులు అమర్చేటప్పుడు వాస్తు శాస్త్రం ప్రకారం ఫాలో అయ్యి చేస్తారు.అయితే విలువైన సమయాన్ని చూపించే గడియారాన్ని కూడా చాల మంది వాస్తు ప్రకారం పెట్టడం జరుగుతుంది.చాల మంది వాళ్ళకి ఎటు వైపు టైం చూడడానికి బాగా అనుకూలంగా ఉంటుందో ఆ గోడకు గడియారం పెట్టుకోవడం జరుగుతుంది.వాస్తు శాస్త్రం ప్రకారం కూడా గడియారం ఇంట్లో పెట్టుకోవచ్చు అని చాల మందికి తెలీదు.కానీ గడియారం ఏ ప్రదేశంలో పెట్టాలో లేక ఏ ప్రదేశంలో పెట్టకూడదో వాస్తు శాస్త్ర నిపుణులు చెప్పడం జరిగింది.
సమయం ఏంటో విలువైనది అలాంటి విలువైన సమయాన్ని చూపించే గడియారం ఇంట్లో సరైన దిశలో పెట్టినప్పుడే మన ఇంట్లో అన్ని పరిస్థితులు చక్కగా ఉంటాయి అని చెప్తున్నారు నిపుణులు.అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ గడియారం పెట్టినప్పుడు మన ఇంట్లో కుటుంబకలహాలు,ఆరోగ్య సమస్యలు మరియు ఆర్ధిక సమస్యలు వంటివి తలెత్తుతాయి.కనుక విలువైన సమయాన్ని చూపించే గడియారం ఎల్లప్పుడూ ఇంట్లో సరైన దిశలో అంటే తూర్పు,పడమర లేక ఉత్తర దిశలో ఉండాలని చెప్తున్నారు నిపుణులు.
కాబట్టి ఇంట్లో గడియారాన్ని సరైన దిశలో పెట్టడం వలన పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఏర్పడుతుందని నిపుణులు చెప్తున్నారు.ఇంట్లో గడియారం ఉత్తరం వైపు వేలాడదీయడం వలన ఇంట్లో సంపద,శ్రేయస్సు వంటివి కలుగుతాయని నిపుణులు చెప్పడం జరిగింది.ధనవంతుడైన కుబేరుడు,వినాయకుడి దిశగా ఉత్తర దిశవైపు చెప్తారు కాబట్టి అటు వైపు గడియారం ఉండడం మంచిది అని చెప్తున్నారు.అలాగే తూర్పు వైపు చెక్క గడియారం పెట్టడం వలన ఇంట్లో చేసే పనుల్లో వృద్ధి మరియు నాణ్యత పెరుగుతుంది.ఎప్పుడు కూడా గడియారం దక్షిణ దిశా ముఖం గోడవైపు కానీ నైరుతి ఆగ్నేయ దిశలో కానీ ఉండకూడదు.అలాగే గడియారాన్ని ఇంటి బయట కానీ లేక తలుపు పై భాగంలో కానీ పెట్టకూడదు.అలాగే ఇంట్లో చెడిపోయిన,ఆగి పోయిన గడియారాలు ఉంటె వెంటనే వాటిని తీసేసి సరిచేయించి పెట్టుకోవాలి అని చెప్తున్నారు నిపుణులు.