చాల మంది యువత ఈ మధ్యకాలం లో సోషల్ మీడియాలో లైకులు మరియు షేర్ల కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి వీడియోలు,సెల్ఫీ లు దిగుతుంటారు.సరదా కోసం వీళ్ళు చేసే పనిలో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.తాజాగా ఇలాగె సరదా కోసం దిగిన వీడియొ ఒకటి ఆ వ్యక్తి ప్రాణాలనే తీసింది.మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ లో జరిగిన ఈ ఘటన అందరి మనసును కలిచివేసింది.శరద్ దేవ్ ఆలయ దర్శనం కోసం వెళ్లిన వీళ్ళు పక్కనే ఉన్న రైలు పట్టాల దగ్గరికి వీడియొ దిగడానికి వెళ్లారు.
ఇటార్సీ నాగపూర్ రైలు మార్గంలో ఒక యువకుడు రైలు వస్తుండగా వీడియొ తీయమని తన స్నేహితుడికి చెప్పాడు.అయితే వీడియొ తీసేటప్పుడు రైలు చాల వేగంగా రావడం,ఆ వీడియొ తీసే వ్యక్తి కూడా తొందరగా అలెర్ట్ కాకపోవడంతో ప్రమాదం జరిగింది.అప్పటికి రైలు డ్రైవర్ హార్న్ కొడుతున్నప్పటికీ ఆ యువకుడు గ్రహించలేక పోవడం తో వేగంగా వచ్చిన రైలు అతనిని ఢీ కొట్టింది.తలకు గాయం అయినా అతనిని ఆసుపత్రి తీసుకెళుతుండగా మార్గం మధ్యలో ఆ యువకుడు ప్రాణాలు వదలడం జరిగింది.
ఆ వీడియొ లో ఉన్న యువకుడు సంజు చౌరే,అతను పంజారా కల గ్రామానికి చెందిన వాడు గా పోలీసులు గుర్తించారు.అతని స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.సామజిక మాధ్యమాల్లో వీడియొ పెట్టేందుకు వీడియొ తీసే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెప్తున్నారు.దయచేసి ఎవ్వరు కూడా సరదా కోసం ఇలా ప్రాణాలు పణంగా పెట్టకండి.