తెలుగు చిత్ర పరిశ్రమలో చాల మంది హీరోలు ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత స్టార్ హీరోలుగా మంచి గుర్తింపును మరియు ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు.అయితే ఇలా హీరోగా ఇండస్ట్రీకి అడుగు పెట్టిన తర్వాత చాల మంది హీరోలు పేరును మార్చుకోవడం జరిగింది.సినిమా ప్రేక్షకులకు చాల మంది స్టార్ హీరోల అసలు పేర్లు ఏంటో తెలీదు.
చిరంజీవి : తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టి తన నటనతో డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు చిరంజీవి.సినిమాలతో పాటు సేవ కార్యక్రమాలు కూడా చేసే చిరంజీవి గారి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్.అయితే తెలుగు సినిమా ప్రేక్షకులకు చాల మందికి చిరంజీవి గారి అసలు పేరు తెలీదు.
రజినీకాంత్:తెలుగు మరియు తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో అయినా రజినీకాంత్ గారి అసలు పేరు శివాజీరావు గైక్వాడ్.
ప్రభాస్:ఈశ్వర్ సినిమా తో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి హీరో గా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు.
పవన్ కళ్యాణ్:అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో పరిచయమైనా హీరో పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తన సినిమాలతో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు.ఆయన అసలు పేరు కొణిదెల కళ్యాణ్ బాబు.
నాని:సినిమా ఇండస్ట్రీ లో హీరో గా ఎంట్రీ ఇచ్చి న్యాచురల్ స్టార్ గా ఎదిగిన నాని అసలు పేరు గంట నవీన్ బాబు.
మోహన్ బాబు:కలెక్షన్ కింగ్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న మోహన్ బాబు గారి అసలు పేరు భక్తవత్సలం నాయుడు.
రవితేజ:ఇడియట్ సినిమాతో హీరోగా మారినా మాస్ మహారాజ్ రవితేజ అసలు పేరు భూపతి రాజు రవిశంకర్ రాజు.
కృష్ణ:సూపర్ స్టార్ కృష్ణ గారి అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణ.