స్నేహితురాలి కోసం సమంత చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్….

ఇటీవలే సమంత నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకోని విడిపోయిన సంగతి అందరికి తెలిసిందే.విడాకుల తర్వాత కూడా సమంత తనకు సంబంధించిన పోస్ట్ లను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ వస్తుంది.చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత తన స్నేహితులతోనే ఎక్కువ సమయం గడుపుతూ చైతన్య జ్ఞపకాలను మర్చిపోయే ప్రయత్నం చేస్తుంది సమంత.జీవితంలో కష్ట సుఖాలు పంచుకోవడానికి మంచి స్నేహితులు ఉండాలి.మనం కష్టంలో ఉన్నప్పుడే మంచి స్నేహితుల విలువ తెలుస్తుంది.ఆస్తుల కంటే కూడా కష్టసుఖాలు పంచుకోవడానికి మంచి స్నేహితులు ఉండాలి అని చెప్తుంటారు చాల మంది.

తాజాగా సమంత తన బెస్ట్ ఫ్రెండ్ కోసం సోషల్ మీడియా ఖాతాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేసారు.సమంత తన బెస్ట్ ఫ్రెండ్ అయినా మంజులకు బర్త్ డే విషెస్ చెప్తూ,నీ లాంటి ఒక ఫ్రెండ్ నా జీవితంలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను,కష్టము వచ్చినప్పుడే నిజమైన స్నేహితులు ఎవరో తెలుస్తుంది అని చెప్తుంటారు కదా నాకు నీకంటే నిజమైన ఫ్రెండ్ ఎవ్వరు లేరు డాక్టర్ అని పోస్ట్ చేసారు.నేను కూడా నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు కూడా తెలిసే ఉంటుంది కదా హ్యాపీ బర్త్ డే అని సమంత పోస్ట్ చేసారు.

సమంత ఫ్రెండ్ మంజుల బర్త్ డే పార్టీ కి సమంత తో పాటు డైరెక్టర్ నందిని రెడ్డి కూడా వెళ్లారు.ఇటీవలే సామ్ తన ఫ్రెండ్ శిల్ప రెడ్డి తో కలిసి పుణ్య స్థలాలకు వెళ్లి పూజ కార్యక్రమాలు నిర్వహించిన సంగతి అందరికి తెలిసిందే.మరోవైపు సమంత శాకుంతలం చిత్రం తో బిజీ గా ఉండగా,వరుస సినిమాలకు కూడా ఓకే చేస్తున్నారు.మరో అయిదు సంవత్సరాల వరకు కూడా సమంత డేట్స్ ఖాళీగా లేవు అని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *