హాలీవుడ్ సినిమాలో సమంత ఎలాంటి పాత్రలో కనిపించబోతుందో తెలుసా…!

చైతూతో విడాకుల తర్వాత వరుస సినిమాలకు ఓకే చెప్తూ బిజీగా ఉంది స్టార్ హీరోయిన్ సమంత.ఇప్పటికే తెలుగులో సమంత నటించిన శాకుంతలం అనే చిత్రం షూటింగ్ పూర్తి చేస్తుకుని విడుదలకు సిద్ధం గా ఉంది.శాకుంతలం చిత్రం తో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే.మరో పక్క సమంత తమిళ్ లో కాదు వాక్కుల రెండు కాదల్ అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు.ఈ చిత్రం లో నయనతార కూడా మరొక హీరోయిన్ గా నటిస్తున్నారు.

వీటితో పాటు సమంత సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా లో స్పెషల్ సాంగ్ లో కనిపించనున్నారు.మరో రెండు కొత్త సినిమాలకు కూడా సమంత ఓకే చెప్పడం జరిగింది.అయితే తాజాగా సమంత వీటన్నిటితో పాటు ఒక హాలీవుడ్ సినిమాకు కూడా ఓకే చేశారట.ఫిలిప్ జాన్ దర్శకత్వం వహిస్తున్న ఒక ఇంటర్నేషనల్ చిత్రంలో బైసెక్సువల్ అమ్మాయి పాత్రలో నటించడానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.ఈ సినిమాలో కేవలం పురుషులకు మాత్రమే కాకుండా స్త్రీల ఆకర్షణకు లోనయ్యే పాత్రలో కనిపించనుంది సమంత.

భారతీయ రచయితా అయినా యెన్ మురారి రాసిన నవల నుంచి రూపొందుతుంది ఈ చిత్రం.2004 సంవత్సరంలో ఈ నవల అత్యధికంగా అమ్ముడుపోవడం జరిగింది.ఎరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అని ఈ చిత్రానికి పేరు ఖరారు చేయడం జరిగింది.ఈ సినిమా తెలుగు,తమిళం తో పాటు ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ భాషలలో కూడా తెరకెక్కబోతుంది.ఇండియన్ అవుట్ ఫిట్ గురు ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది.ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఆగష్టు 2022 లో మొదలుకానుంది సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *