Home ఆరోగ్యం దగ్గు,గొంతు నొప్పిని ఈ చిన్న చిట్కాలతో తగ్గించుకోవచ్చు..

దగ్గు,గొంతు నొప్పిని ఈ చిన్న చిట్కాలతో తగ్గించుకోవచ్చు..

0

ఈ శీతాకాలంలో చాల మంది గొంతు నొప్పి,జలుబు,దగ్గు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు.ఇప్పుడున్న ఆహారపు అలవాట్ల వలనో లేక కాలుష్యం వలనో ఆరోగ్య సమస్యలు ఏర్పడి ఇబ్బంది పడతారు.అయితే ఇలాంటివి తగ్గడానికి ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.గొంతు నొప్పి మరియు దగ్గు తగ్గడానికి ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.

నల్ల యాలుకలుతో :నల్ల ఎలుకలలో యాంటీ ఆక్సిడెంట్స్ చాల ఎక్కువగా ఉండడం వలన అవి గొంతు నొప్పిని తగ్గించడంలో చాల బాగా పని చేస్తాయి.ఈ శీతాకాలంలో గొంతు నొప్పి మరియు దగ్గు తగ్గడానికి నల్ల యాలుకలు బాగా సహాయం చేస్తాయి.

లవంగాలతో:లవంగాలను రాళ్ల ఉప్పుతో కలిపి నమిలి తింటే గొంతు నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందొచ్చు.ఇలా లవంగం మరియు రాళ్ల ఉప్పు కలిపి తీసుకోవడం వలన అది వాపు నుంచి త్వరగా ఉపశమనాన్ని కలిగిస్తుంది.

గోరు వెచ్చని నీరు తాగాలి:ఈ శీతాకాలంలో మనం తక్కువగా నీరు తగినప్పటికీ గోరు వేచి ని నీరు తాగడం చాల మేలు అని చెప్తున్నారు నిపుణులు.అది గొంతును ఇన్ఫెక్షన్ నుంచి తగ్గిస్తుంది.
తేనే మరియు అల్లం కలిపి తీసుకోవడం:వేడి నీటిలో తేనే మరియు అల్లం కలిపి తాగడం వలన గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా దగ్గు కూడా త్వరగా తగ్గుతుంది.

పసుపుతో :పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయం చేస్తాయి.ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా పసుపు మరియు కొద్దిగా ఉప్పు కలిపి తీసుకోవడం వలన గొంతు నొప్పి మరియు దగ్గు నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here