సినిమా ఇండస్ట్రీలో అందంగా ఉండే హీరోయిన్లకు చాల డిమాండ్ ఉంటుంది అన్న సంగతి అందరికి తెలిసిందే.హీరోయిన్ అనగానే స్టార్ డమ్,కోట్లలో సంపాదన ఉంటుంది అని అందరు అనుకుంటారు.ఎల్లప్పుడూ అందంగా కనిపిస్తూ,వ్యాయామం చేస్తూ కరెక్ట్ ఫిట్ నెస్ ఉన్న హీరోయిన్లకే అవకాశాలు కూడా క్యూ కడతాయి.అలా అందంగా కనిపించటానికి వెనుక చాల సర్జరీలు ఉంటాయి.
కొన్ని కొన్ని సార్లు సరైన నిద్ర,విశ్రాంతి కూడా లేకుండా కుటుంబాన్ని వదిలేసి అవుట్ డోర్స్ లో గడపాల్సి వస్తుంది.ఇష్టమైన ఆహారాన్ని కూడా వదిలేసి శరీర బరువును కూడా పాత్రకు తగ్గట్టు మైంటైన్ చేయాల్సి వస్తుంది.ఇలా అవకాశాల కోసం రిస్క్ అయినా కూడా గ్లామర్ కోసం సర్జరీలు చేయించుకున్న హీరోయిన్లు చాల మంది ఉన్నారు.ఆ సర్జరీల కోసం కోట్లు ఖర్చు పెట్టిన వారు కూడా ఉన్నారు.వారు ఎవరంటే:
శ్రీదేవి:అతిలోక సుందరి అయినా శ్రీదేవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆ రోజుల్లోనే శ్రీదేవి గారు నోస్ సర్జరీ కోసం కోటి రూపాయల వరకు ఖర్చు చేయడం జరిగింది.
శ్రీయ శరన్:ఇష్టం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా శ్రీయ ఆ తర్వాత అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన సంతోషం సినిమా తో హిట్ అందుకొని వరుస అవకాశాలతో ఒక ఊపు ఊపింది.ఈ అమ్మడు తన లిప్ సర్జరీ కోసం ఏకంగా మూడు కోట్లు ఖర్చు పెట్టింది.
సమంత:ఏమ్ మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసిన సమంత ఆ తర్వాత వరుస అవకాశాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.సమంత తన నోస్ సర్జరీ కోసం రెండు కోట్లు ఖర్చు పెట్టింది.
ఆసిన్:అందాల భామ ఆసిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈమె తన లిప్ సర్జరీ కోసం కోటి రూపాయల వరకు ఖర్చు చేసింది.
త్రిష:ప్రభాస్ హీరోగా తెరకెక్కిన వర్షం సినిమాతో యెనలేని ఫాలోయింగ్ సంపాదించుకున్న త్రిష తన ముక్కు సర్జరీ కోసం మూడు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసింది.
శృతి హాసన్:శృతి హాసన్ తన సర్జరీ కోసం 2 .5 కోట్లు ఖర్చు చేయడం జరిగింది.
అనుష్క శెట్టి:బరువు తగ్గడం కోసం అనుష్క లైపో సెక్షన్ కోసం కోటి రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.
నయనతార:అందాల భామ నయనతార లైపో సెక్షన్ మరియు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది.వీటికోసం నయన్ దాదాపుగా 4 కోట్లు ఖర్చు చేసిందని సమాచారం.
తాప్సి:తాప్సి తన ముక్కు సర్జరీ కోసం కోటిన్నర ఖర్చు చేయడం జరిగింది.
కాజల్ అగర్వాల్:చందమామ లాంటి హీరోయిన్ కాజల్ తన ముక్కు సర్జరీ కోసం రెండు కోట్లు వరకు ఖర్చు పెట్టింది.
కార్తీక:కార్తీక తన సర్జరీ కోసం కోటి రూపాయల వరకు ఖర్చు చేసింది.