ఆ రోడ్డు వెళ్తున్న వాహనదారులు ఎక్కువ ఉన్న రోడ్డు..రద్దీ రోడ్డు.ఆ దారిలో ప్రయాణిస్తున్న వాహనదారులకు ఆ రోడ్డు మధ్యకు వచ్చే సరికి అకస్మాత్తుగా వింత శబ్దాలు వినిపిస్తున్నాయి.ముందు ఆ శబ్దాలను ఎవ్వరు కూడా పట్టించుకోలేదు.కానీ తర్వాత ఆ శబ్దాలు మెల్లమెల్లగా ఎక్కువగా రావడంతో ఆ దారిలో వెళ్తున్న వాహనదారులకు అనుమానం వచ్చింది.వాళ్ళందరూ ఆ వింత శబ్దాలు ఎక్కడ నుంచి వస్తున్నాయో కనుక్కో దానికి ఆ రోడ్డు పక్కనే ఉన్న కాలువలో చూసారు.ఆ ఘటన చూసిన వాళ్ళందరి ఫ్యూజులు ఎగిరిపోయాయి.
కేరళలో ఈ ఘటన జరిగింది.కేరళ లోని కోచికోడ్ లో కొండచిలువలు కలకలం రేపాయి.అక్కడ స్థానికంగా కారపరంభ శివారు ప్రాంతంలో కనోలి కాలువలో ఏకంగా ఆరు కొండచిలువలు కనిపించాయి.ఆ దారిన వెళ్తున్న వాహనదారులు ఆ కొండచిలువలను చూసి ఒక్కసారిగా ఖంగు తిన్నారు.ఈ క్రమంలోనే ఆ చుట్టుపక్కల భారీగా ట్రిఫిక్ జామ్ అవ్వడంతో సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకోవడం జరిగింది.
అటవీ శాఖ సిబ్బంది వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించారు.అక్కడ ఒక కొండా చిలువ తప్ప మిగిలినవి మాయం అయిపోయాయి.ఆ కొండచిలువలు ఆహారాన్ని వెతుక్కునే క్రమంలో అడవి నుంచి బయటకు వచ్చి ఉంటాయి అని అటవీ శాఖ సిబ్బంది తెలపడం జరిగింది.అక్కడే దొరికిన ఒక కొండచిలువను అటవీ శాఖ సిబ్బంది సురక్షిత ప్రాంతానికి తీసుకోని వెళ్లి వదిలిపెట్టారు.