9 నెలల చిన్నారికి ఇండియా స్టార్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు…చిన్నారి ప్రతిభకు ప్రశంసల వర్షం

సాధారణంగా ఎవరైనా వయస్సులో ఉన్న వారు ఏదైనా గొప్ప పని చేస్తే వారికీ ఉన్న ప్రతిభ తో ఆ పనిని సాధించారు అని అందరు అనుకుంటారు.తాజాగా 9 నెలల చిన్నారి ఇండియా స్టార్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది.9 నెలలు ఉన్న లశ్విక ఆర్య ఇలా ఇండియా స్టార్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకోవడం విశేషం అని చెప్పచ్చు.లశ్విక ఆర్య రేబాకకు కు చెందిన మంత్రి వెంకట నారాయణమూర్తి,తేజస్విని దంపతుల కూతురు.కేవలం నాలుగు నిమిషాల వ్యవధిలోనే లశ్విక 24 శరీర భాగాలను గుర్తించింది.

అతి చిన్న వయస్సులో లశ్విక తన ప్రతిభ తో వార్తల్లో నిలవడంతో స్టార్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ పథకంతో పాటు ప్రశంస పత్రాన్ని కూడా నేరుగా లశ్విక ఆర్య ఇంటికి పంపించడం జరిగింది.6 నెలల అతి చిన్న వయస్సులో లశ్విక ఆర్య రెండు అంతర్జాతీయ స్థాయి అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం.గతంలో కూడా లశ్విక ఆర్య ఛాంపియన్ బుక్ ఆఫ్ అవార్డు లో చోటు సాధించి వార్తల్లో నిలిచినా సంగతి అందరికి తెలిసిందే.లశ్విక మెమరీ ఆఫ్ జనరల్ క్నాలెడ్జ్ విభాగం లో ఈ ఘనతను సొంతం చేసుకుంది.ఈ చిన్నారి రాష్ట్ర ముఖ్యమంత్రుల ఫోటోలను కూడా చాల సులువుగా గుర్తించగలదు.

లశ్విక ప్రతిభను,ఆమె తల్లి తండ్రుల ప్రతిభను యెంత పొగిడిన తప్పు లేదు అని చెప్పచ్చు.ఇక ఈ చిన్నారిని నెటిజన్లు పిట్ట కొంచెం కూత ఘనం అంటూ కామెంట్స్ తో ప్రశంసిస్తున్నారు.చిన్నారి లశ్విక సాధించిన ఘనతకు గుడివాడ మంత్రి అమర్నాథ్ సైతం హర్షం వ్యక్తం చేసారు.అంతర్జాతీయ బాలికల దినోత్సవం రోజున ఈ చిన్నారి పుట్టిన రోజు కావడం విశేషం అని చెప్పచ్చు.లశ్విక ఆర్య సాధించిన ఘనతకు,ఈ చిన్నారి ప్రతిభకు యెంత పొగిడినా తక్కువే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.రాబోయే రోజుల్లో ఈ చిన్నారి మరిన్ని విజయాలు సాధించాలి అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *