Home సినిమా ఆర్య సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో…ఏం చేస్తుందో తెలుసా…లేటెస్ట్ ఫోటోలు వైరల్…

ఆర్య సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో…ఏం చేస్తుందో తెలుసా…లేటెస్ట్ ఫోటోలు వైరల్…

0

అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్ లో ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాలు కూడా విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే.వీరిద్దరి కాంబినేషన్ మీద ప్రేక్షకులలో భారీగానే అంచనాలు నెలకొంటాయి.ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ఆర్య యెంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ఆర్య సినిమా కథను సుకుమార్ అల్లు అర్జున్ కంటే ముందు చాల మంది హీరోలకు వినిపించారు.కానీ ఆ కథ చివరకు అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లడం ఆయన ఓకే చెప్పడం,ఆ సినిమా చేసి హిట్ అందుకోవడం జరిగింది.

ఆర్య సినిమాలో డిఫరెంట్ గా ప్రేమను చూపించడంలో సుకుమార్ సక్సెస్ అయ్యారు అని తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడిగా అను మెహతా హీరోయిన్ గా నటించడం జరిగింది.ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయ్యింది.అయితే అను మెహతా కు ఇది మొదటి సినిమా అయినప్పటికీ కూడా తన అందంతో,నటనతో ప్రేక్షకులను మెప్పించింది.ఇన్నోసెంట్ అమ్మాయి పాత్రలో అను మెహతా ఈ సినిమాలో ఒదిగిపోయింది అని చెప్పచ్చు.

ఈ ఒక్క హిట్ సినిమాతో అను మెహతా తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికి బాగా గుర్తుండిపోయింది.మొదట మోడల్ గా రాణించిన అను మెహతా ఈ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత అల్లరి నరేష్ కు జోడిగా ఒక సినిమా చేసిన ఈమె ఆ తర్వాత ఇక సినిమాలలో కనుమరుగైపోయింది.ఇక సోషల్ మీడియా ద్వారా అను సముద్ర తీరాన ఉన్న కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు గీత ఏంటి ఇలా మారిపోయింది అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Actress Gallery (@actressgalleryc)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here