తెలుగు సినిమా ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఎటువంటి బ్యా గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన స్వయంకృషి తో స్టార్ హోదాను సంపాదించుకున్నారు.ఎన్నో సినిమాలలో రియల్ స్టంట్స్ చేసి ప్రేక్షకులను అలరించారు.66 ఏళ్ళ వయస్సులో కూడా కుర్రహీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ తన డాన్స్ తో,నటనతో బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్స్ అందుకుంటున్నారు.ఈయన చేసే రియల్ స్టంట్స్ గురించి అందరికి తెలిసిందే.కానీ ఇప్పుడు వయస్సు రీత్యా స్టంట్స్ విషయంలో రిస్క్ తీసుకోవడం లేదు.అయితే చిరంజీవి గారికి గత 30 సంవత్సరాలుగా ఒక వ్యక్తి డూప్ గా నటిస్తున్నారు.సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు రియల్ ఫైట్లతో అలరించే హీరోలు అప్పుడప్పుడు డూప్ లతో కూడా కొన్ని సన్నివేశాలు తీయిస్తూ ఉంటారు.
మరి ముఖ్యంగా రిస్క్ స్టంట్స్ చేయడానికి చాల మంది హీరోలు సాహసించరు.ఆ టైములో డూప్ లతో సన్నివేశాలు తీయిస్తారు దర్శకులు.అంతటి రిస్క్ సన్నివేశాలు చేసిన కూడా ఇదివరకటి రోజుల్లో వారి గురించి ప్రేక్షకులకు తెలిసేది కాదు.కానీ ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి డూప్ ల గురించి కూడా తెలుస్తుంది.ఇక ఇలా హీరోలకు డూప్ గా వ్యవహరించే వారిని కొన్ని చానెల్స్ లైవ్ టైం లోకి తీసుకువస్తుండటంతో వారికి కూడా ఆదరణ పెరిగింది.అయితే ఇటీవలే ఒక షో లో చిరంజీవి కు గత 30 ఏళ్లుగా డూప్ గా చేస్తున్న వ్యక్తి ఎవరు..
అనే విషయాలు తెలిసాయి.ప్రముఖ ఛానల్ అయినా ఈటీవీ లో ఇటీవలే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ఒక కొత్త షో స్టార్ట్ అయ్యింది.ఈ షో నిర్వాహకుల కొన్ని ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఉన్న టాలెంట్ ను బయటకు తీసుకొస్తున్నారు.ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లాకు వెళ్లగా ఆ షో లో చిరంజీవి కు డూప్ గ వ్యవహరించే వ్యక్తి రావడం జరిగింది.ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మార్టూరు కి చెందినవారు.ఈయన చిరంజీవి గారికి 30 ఏళ్ళ నుంచి డూప్ గా చేస్తున్నారు.ఈయనకు రికార్డింగ్ డాన్స్ పేరిట ఒక కంపెనీ కూడా ఉంది.