Lavanya Tripathi: టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.అందాల రాక్షసి సినిమాతో ఈమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.ఇటీవలే ఈమె వరుణ్ తేజ్ ను ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.ప్రస్తుతం లావణ్య త్రిపాఠి ఆస్తుల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.గత కొంతకాలంగా ప్రెమించు కుంటున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి జూన్ 9 నే ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.
నాగబాబు నివాసంలో వీరిద్దరి ఎంగేజ్మెంట్ బంధువులు,స్నేహితులు మధ్యలో ఘనంగా జరిగింది.వీరిద్దరి నిశ్చితార్ధం తర్వాత లావణ్య త్రిపాఠి ఆస్తుల గురించి అందరిలో ఆసక్తి కరమైన చర్చ జరుగుతుంది.మెగా ఇంటి కోడలిగా అడుగుపెట్టబోతున్న లావణ్య త్రిపాఠి ఆస్తుల గురించి ప్రస్తుతం అందరు చర్చించుకుంటున్నారు.లావణ్య త్రిపాఠి తన అందంతో నటనతో టాలీవుడ్ లో మంచి పేరును సంపాదించుకున్నారు.సినిమాలలో నటించడంతో పాటు ఈమె పలు బ్రాండ్ ల ప్రకటనలలో కూడా నటించారు.
ఈమె నికర విలువ 2023 నాటికీ దాదాపు 10 కోట్లు ఉంటుందని అంచనా.వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి మొదటి సారి శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన మిస్టర్ సినిమాలో కలిసి నటించారు.ఆ తర్వాత అంతరిక్షం సినిమాలో కూడా వీరిద్దరూ కలిసి నటించారు.అప్పటి నుంచే ఇష్టపడిన వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు.వీరిద్దరి వివాహం ఈ ఏడాది చివరలో రాజస్థాన్లోని ఒక బడా పాలస్ లో చేస్తున్నట్లు సమాచారం.అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావలసి ఉంది.