Home » సినిమా » అఖిల్ కాకుండా చైతుకు మరో తమ్ముడు ఉన్నాడని మీకు తెలుసా…

అఖిల్ కాకుండా చైతుకు మరో తమ్ముడు ఉన్నాడని మీకు తెలుసా…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న బడా ఫ్యామిలిలో దగ్గుపాటి మరియు అక్కినేని ఫ్యామిలీలు కూడా ఉన్నాయి.ఈ రెండు కుటుంబాల నుంచి సినిమా ఇండస్ట్రీలోకి స్టార్ హీరోలు కూడా వచ్చారు.ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో దగ్గుపాటి రామానాయుడు గారికి మరియు అక్కినేని నాగేశ్వరరావు గారికి చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి.ఈ క్రమంలోనే రామానాయుడు కూతురు అయినా లక్ష్మిని నాగార్జునకు ఇచ్చి వివాహం జరిపించి తన కోడలిగా చేసుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు గారు.

అప్పటికే అమెరికా లో చదువుకుంటున్న లక్ష్మి ఇండియా కు రావడం ఇష్టం లేకపోయినప్పటికీ వచ్చి నాగార్జున ను పెళ్లి చేసుకున్నారు.అయితే వివాహం చేసుకున్న తర్వాత మల్లి అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ అవుదాం అని చెప్పారట.కానీ నాగార్జున ఇక్కడ సినిమాలు చేస్తుండడంతో విదేశాలకు రాలేను అని చెప్పడం జరిగింది.అప్పటికే ఈ దంపతులకు నాగ చైతన్య పుట్టడం జరిగింది.

అయినప్పటికి వీళ్లిద్దరు విడాకులు తీసుకోవడం జరిగింది.చిన్నతనంలో తల్లి దగ్గరే పెరిగిన నాగ చైతన్య ఆ తర్వాత వయసుకు వచ్చిన తర్వాత తండ్రి దగ్గరకు వచ్చి సినిమాలలో శిక్షణ తీసుకున్నారు.జోష్ సినిమాతో హీరోగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నాగ చైతన్య.లక్ష్మి తో విడాకుల తర్వాత నాగార్జున అమలను ప్రేమించి వివాహం చేసుకున్నారు.అటు లక్ష్మి కూడా విడాకుల తర్వాత మరో వ్యక్తిని వివాహం చేసుకున్నారు.ఆ తర్వాత వాళ్లకు ఒక కుమారుడు పుట్టడం జరిగింది.ఇలా నాగ చైతన్యకు అఖిల్ తో పాటు మరో తమ్ముడు కూడా ఉన్నాడు.అతనికి ఇప్పటికే అతనిని వివాహం కూడా జరిగిపోయింది.అతను సినిమాల్లోకి రాకుండా వ్యాపారంలో రాణిస్తున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *