Home » సినిమా » ఆచార్య సినిమాకు చిరంజీవి,రామ్ చరణ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా…

ఆచార్య సినిమాకు చిరంజీవి,రామ్ చరణ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా…

సైరనరసింహ రెడ్డి సినిమా తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకోని మెగా స్టార్ చిరంజీవి ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా సంగతి అందరికి తెలిసిందే.కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తో కలిసి చేసిన సినిమా ఆచార్య మీద ప్రేక్షకులలో భారీగానే అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటికే రిలీజ్ అయినా ఆచార్య సినిమా ట్రైలర్,టీజర్ అన్ని కూడా ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా చేస్తున్నాయి.ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.150 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంటున్నారు.అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ నెల ఏప్రిల్ 29 న విడుదలకు సిద్ధంగా ఉంది.ఇటీవలే తాజాగా ఈ చిత్రం యూనిట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్నారు.

ఈ సినిమా ట్రైలర్ టీజర్ అన్ని చూసాక సినిమా సూపర్ హిట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తో కలిసి చేసిన సినిమా అవడటంతో ఈ సినిమాకు బడ్జెట్ యెంత అయ్యి ఉంటుంది మరియు చిరంజీవి,రామ్ చరణ్ ల రెమ్యూనరేషన్ యెంత అనే దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.ఇటీవలే జరిగిన ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత మరియు మ్యాట్నీ ఎంటెర్టైన్మెంట్స్ వ్యవస్థాపకుడు నిరంజన్ రెడ్డి పలు ఆసక్తి కరమైన విషయాలు తెలిపారు.ఆచార్య సినిమాను చిరంజీవి మరియు రామ్ చరణ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసారని,వారిద్దరి పారితోషకం మీద వస్తున్నా వార్తలు అన్ని కూడా అబద్ధం అని తెలిపారు.

ఈ సినిమాకు తమ హీరోలు ఎలాంటి పారితోషకం తీసుకోలేదని,సినిమా విడుదల అయ్యాక వచ్చే ఫలితం,లాభాల ఆధారంగా పారితోషకం చూద్దాం అని మాకు భరోసా ఇచ్చారంటూ నిర్మాత నిరంజన్ రెడ్డి తెలిపారు.మాములుగా అయితే రామ్ చరణ్ ఒక్కో సినిమాకు 25 నుంచి 30 కోట్లు రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.ఇక ట్రిపుల్ ఆర్ కోసం రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ 45 రెమ్యూనరేషన్ అందుకున్నారు.ఇక చిరంజీవి బయట బ్యానర్ లో చేసే సినిమాలకు 50 కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు టాక్.అయితే ఒకవేళ ఆచార్య సినిమాకు ఈ ఇద్దరు హీరోలు రెమ్యూనరేషన్ అంటే 80 కోట్ల వరకు అయ్యేది.అలంటి పరిస్థితిలో సినిమా బడ్జెట్ తడిసి మోపెడు అయ్యేది.కానీ ఇద్దరు హీరోలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో సినిమా చేయడంతో నిర్మాతలు కూడా ఫ్రీగా సినిమా రిలీస్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *