ఆచార్య సినిమాలో కాజల్ లేకపోయినా కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్ తీసుకోవడానికి వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసా…

మెగా స్టార్ చిరంజీవి,రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య చిత్రం ఈ నెల 29 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.రిలీజ్ అయినా మొదటి షో తోనే ఈ మూవీ పాజిటివ్ టాక్ తో థియేటర్లలో దూసుకుపోతుంది.దర్శకుడు కొరటాల శివ దేవాలయాలలో జరుగుతున్నా అక్రమాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఈ చిత్రంలో హీరో రామ్ చరణ్ సిద్హ పాత్రలో కనిపించారు.అయితే సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ పూజ హెగ్డే నటించడం జరిగింది.అయితే ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి కు జోడిగా హీరోయిన్ కాజల్ నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ విషయాన్నీ గతంలో సినిమా యూనిట్ ప్రకటించడం జరిగింది.ఆచార్య సినిమా నుంచి అప్పట్లో విడుదల అయినా లాహే లాహే పాటలో కూడా కాజల్ కనిపించి స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే.

అయితే ఆచార్య ట్రైలర్ లో మాత్రం కాజల్ కనిపించకపోవడం అందరికి ఆశ్చర్యానికి గురి చేసింది.ఈ సినిమాలో కాజల్ పాత్రను తొలగించారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.అయితే ఆ వార్తలను నిజం చేస్తూ సినిమా లో కాజల్ పాత్రను తొలగించడానికి గల కారణాలు తెలిపారు దర్శకుడు కొరటాల శివ.అయితే అప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న తర్వాత స్టోరీ పరంగా చిరంజీవికి హీరోయిన్,ప్రేమ ఉంటె బాగుండవని కాజల్ పాత్రను తొలగించినట్లు తెలిపారు కొరటాల శివ.

ఈ విషయం గురించి కాజల్ తో కూడా చెప్పగా ఆమె చిరునవ్వుతో సినిమా నుంచి తప్పుకుందని తెలిపారు.అయితే ఈ సినిమాలో కాజల్ రెమ్యూనరేషన్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ సినిమాలో మొదటి షెడ్యూల్ పూర్తి అయినా తర్వాత హీరోయిన్ కాజల్ తప్పుకోవడం జరిగింది.అయితే అప్పటికే కాజల్ అందుకు సంబంధించి పారితోషకం తీసుకుందని సమాచారం.ఆచార్య సినిమా కోసం కాజల్ కోటిన్నర రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుందని సమాచారం.అందుకే కాజల్ ఆ తరువాత తనను మూవీ నుంచి తప్పించిన పెద్దగా పట్టించుకోలేదని సమాచారం.తాజాగా కాజల్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి అందరికి తెలిసిందే.తమ బిడ్డ పేరు నీల్ కిచ్లు అంటూ కాజల్ భర్త గౌతమ్ కిచ్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *