Actor Nani: టాలీవుడ్ లో నాని బాపు,శ్రీను వైట్ల దగ్గర సహాయ దర్శకుడిగా తన కెరీర్ ను స్టార్ట్ చేసారు.మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన అష్టాచెమ్మా సినిమాతో నాని హీరో గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.మొదటి సినిమాతోనే నాని తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.హీరోగా అష్టాచెమ్మా సినిమా నాని కి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.ఇక వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాకుండా నాని కి వరుస అవకాశాలు క్యూ కట్టాయి.అలా నాని తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి హీరో గా ఎదిగిన వాళ్లలో నాని కూడా ఒకరు అని చెప్పచ్చు.
నాని తన కెరీర్ ప్రారంభం లో అసిస్టెంట్ డైరెక్టర్ గా,రేడియో జాకీ గా పనిచేసారు.ఆ తర్వాత అష్టాచెమ్మా సినిమాతో హీరో గా మారిన నాని తెలుగులో అలా మొదలయ్యింది,భీమిలి కబడ్డీ జట్టు వంటి సినిమాలలో నటించి తన నటనతో విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు.నాని తెలుగులో ఈగ,భలే భలే మగాడివోయ్,ఎంసీఏ,శ్యామ్ సింగరాయ్,నేను లోకల్ వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించారు.ఇటీవలే నాని దసరా సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో విజయం అందుకొని గుర్తింపును సంపాదించుకున్నారు.ఈ సినిమాలో ఊర మాస్ పాత్రలో నాని మెప్పించారు.
ఇక తాజాగా నాని హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా సంగతి అందరికి తెలిసిందే.ఈ సినిమాలో నాని కు జోడిగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా పోస్టర్స్,సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.ఇది ఇలా ఉంటె నాని 2012 అక్టోబర్ 27 న తన స్నేహితురాలు అంజనాను ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఈ దంపతులకు ఒక బాబు ఉన్నాడు.ఇక తమ వివాహం జరిగి 11 సంవత్సరాలు పూర్తి అయినా సందర్భంగా నాని తన భార్య తో ఉన్న ఒక అందమైన ఫోటోను షేర్ చేసుకున్నారు.తన భార్య అంజనకు బొట్టు పెడుతున్న పిక్ షేర్ చేస్తూ నాని మా బంధానికి 11 సంవత్సరాలు అంటూ క్యాప్షన్స్ ఇచ్చారు.ఈ పోస్ట్ చుసిన నెటిజన్లు నాని శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఇక నాని,అంజనా అయిదు సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు అని సమాచారం.
View this post on Instagram