Home సినిమా 53 ఏళ్ళ వయస్సులో 23 ఏళ్ళ యువతిని పెళ్లి చేసుకున్న నటుడు పృథ్విరాజ్…ఇంతకీ ఆ యువతి...

53 ఏళ్ళ వయస్సులో 23 ఏళ్ళ యువతిని పెళ్లి చేసుకున్న నటుడు పృథ్విరాజ్…ఇంతకీ ఆ యువతి ఎవరో తెలుసా…

0

బబ్లూ పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఫిలాసఫర్, డాక్టర్, దాదాపు ఆయన చేయని రోల్ అంటూ లేదంటే సందేహం లేదు. అద్భుతమైన నటన ఆయన సొంతం. ఇంత ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆయన ప్రస్తుతం ఇండస్ర్టీకి దూరమయ్యాడు. చాలా కాలంగా ఆయన వెండితెరపై కనిపించడం లేదు. 

వెండితెరకు దూరంగా విదేశాలలో ఉంటున్న ఆయన గురించి ఒక న్యూస్ ఈ మధ్య బాగా వైరల్ అవుతోంది. అందేంటంటే ఆయన ఇప్పుడు పెండ్లి చేసుకోబోతున్నారట..! బబ్లూ పృథ్వీరాజ్ కు 1994లో బీనాతో వివాహమైంది. వీరికి ఒక కొడుకు అహద్ కూడా ఉన్నాడు. ఇప్పుడు అహద్ కు 27 ఏండ్ల వయస్సు ఉంటుందని పృథ్వీనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అహద్ ఆటిజంతో బాధపడుతున్నాడని, మాటలు రావని కూడా ఆవేదన చెందాడు పృథ్వీరాజ్. 

ఇదిలా ఉంటే 57 ఏండ్లు ఉన్న పృథ్వీరాజ్ 23 సంవత్సరాల వయస్సున్న మలేషియా యువతిని రెండో వివాహం చేసుకున్నరనే వార్తలు గుప్పుమంటున్నాయి. వివాహం సీక్రెట్ గా జరిగిందని సోషల్ మీడియా పెద్ద ఎత్తున కోడై కూస్తోంది. కోలివుడ్, టాలీవుడ్ ఇండస్ర్టీలు కూడా ఈ గాసిప్స్ కు వంతపాడుతున్నాయి. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ ఇస్తానని పృథ్వీరాజ్ కూడా అధికారికంగా ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇంత వయసులో అంత చిన్న ఏజ్ ఉన్న అమ్మాయిని ఎలా పెండ్లి చేసుకుంటాడు, మంచి నటుడు పృథ్వీకి ఇది అవసరమా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ గాసిప్ ఎంత వరకు నిజమో కానీ నెట్టింట్లో మాత్రం వైరల్ అవుతూనే ఉంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here