Kumari Aunty: కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ మూసివేత…అండగా ఉంటానంటున్న హీరో సందీప్ కిషన్

NEWS DESK
2 Min Read
Kumari Aunty

Kumari Aunty: సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చాల మంది వీడియొ ల ద్వారా ఫేమస్ అయినా వాళ్ళు ఉన్నారు.అలా ఫేమస్ అయినా వాళ్లలో కుమారి అనే మహిళ కూడా ఒకరు.ఈమె హైదరాబాద్ లో రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ పెట్టుకొని బిజినెస్ చేస్తూ బాగా ఫేమస్ అయ్యింది.యూట్యూబ్ వీడియోలు,రీల్స్ ఎక్కడ చుసిన కుమారి కనిపించేది.అంతగా ఈమె పాపులారిటీని సంపాదించుకుంది అని చెప్పచ్చు.కుమారి గత కొన్నేళ్ల నుంచి హైదరాబాద్ లో ఫ్యూఫ్ స్టాల్ పెట్టుకొని వ్యాపారం చేస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తూ వస్తుంది.

అయితే తాజాగా పోలీసులు ఈమె వ్యాపారాన్ని మూయించినట్లు తెలుస్తుంది.బాబు మీ బిల్లు మొత్తం వెయ్యి అయ్యింది రెండు లివర్లు ఎక్స్ట్రా అనే ఒక్క లైన్ తో బాగా పాపులర్ అయ్యింది కుమారి ఆంటీ.ఇక ఈమె ఫుడ్ స్టాల్ దగ్గరకు జనాలు బాగా వచ్చేవారు.ఈ క్రమంలోనే కుమారి ఆంటీ కి సంబంధించిన వీడియోలు,ఇంటర్వ్యూ లో సోషల్ మీడియా ప్లేట్ ఫారం లలో బాగా వైరల్ అయ్యాయి.

Also read : అప్పుడే ఓటిటీ లోకి హనుమాన్…ఎప్పుడో తెలుసా.!

Kumari Aunty
Kumari Aunty

ఇక తాజాగా ఊరి పేరు భైరవ కోన అనే కొత్త సినిమా ప్రమోషన్ లో భాగం గా హీరో సందీప్ కిషన్ మరియు హీరోయిన్ వర్ష కూడా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ లో భోజనం చేసారు.తాజాగా పోలీసులు ట్రాఫిక్ సమస్య అవుతుందని కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను మూయించినట్లు తెలుస్తుంది.ఈ క్రమంలోనే హీరో సందీప్ కిషన్ ఆమెకు అండగా ఉంటూ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఈమె ఎంతో మందికి స్ఫూర్తి..ఆమె తన కాళ్ళ మీద తానూ నిలబడి వ్యాపారం చేసుకొంటుంది.ఆమెను ఇలా ఎందుకు చేస్తున్నారు.ఆమెతో నా టీం టచ్ లో ఉంటుంది.వీలైన సహాయం చేస్తాను అని సందీప్ కిషన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *