Home సినిమా ఈ అమ్మాయి తెలుగమ్మాయే.. ప్రముఖ హీరోయిన్ కూడా.. ఎవరో గుర్తు పట్టారా..!

ఈ అమ్మాయి తెలుగమ్మాయే.. ప్రముఖ హీరోయిన్ కూడా.. ఎవరో గుర్తు పట్టారా..!

0
Dimple Hayathi
Dimple Hayathi

కొంత మంది తారలను తెరమీద, తెర వెనుక చూస్తే గుర్తు పట్టకుండా ఉంటాం. వెండితెరపై అందాలతో హొయలొలికించే భామలు తెరవెనుక ఎలా ఉంటారో ఊహించలేం. అలాంటిదే ఈ తెలుగు హీరోయిన్.. ఈమె తెలుగు అమ్మాయే.. ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడలో పుట్టింది. హైదరాబాద్ లో పెరిగింది. సినీ ఇండస్ర్టీకి వద్దామనుకుంది. కానీ ఆమెను చాన్స్ లు పెద్దగా వరించలేదు. ఎలాగోలా ఒక మూవీలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. తర్వాత ఒక ‘మెగా’ మూవీలో ఐటం సాంగ్ చేసింది. కుర్రకారును తన వైపునకు తిప్పుకుంది కూడా. తమిళంలో కూడా హీరోయిన్ గా చేస్తూ ఫేం సంపాదించుకుంది. ఇక ఫ్యాన్ ఫాలోయింగ్ లో కూడా ఈమె వెనక్కి తగ్గలేదు.

Dimple Hayathi
Dimple Hayathi

ఇక విషయానికి వస్తే ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ పేరు డింపుల్ హయతి. మేకప్ లేకపోవడం వల్ల ఆమెను గుర్తించడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఈమె సినీ కెరియర్ గురించి తెలుసుకుందాం.. దర్శకుడు సునీల్ కుమార్ తెరకెక్కించిన ‘గల్ఫ్’ మూవీతో హీరోయిన్ గా పరిచయమైంది ఈ తెలుగింటి బ్యూటీ. తరువాత ప్రభుదేవా డైరెక్షన్ లో వచ్చిన ‘అభినేత్రి-2’లో కూడా కీలక పాత్ర పోషించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ‘గద్దల కొండ గణేశ్’ చిత్రంలో ఒక ఐటం సాంగ్ లో నర్తించింది. ఈ సాంగ్ తో ఆమెకు పాపులారిటీ విపరీతంగా పెరిగింది. 

Dimple Hayathi
Dimple Hayathi

మెగా హీరోతో నర్తించిన తర్వాత అమ్మడు ‘యురేకా’ చిత్రంలో నటించింది. బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది చిన్నది. ధనుష్, సారా అలీఖాన్ జంటగా నటించిన ‘అత్రాంగి రే’లో అతిథి పాత్రలో మెప్పించి ఒప్పించింది. విశాల్ హీరోగా వచ్చిన చిత్రం ‘సామాన్యుడు’, రవితేజ ‘కిలాడి’లో డింపుల్ హీరోయిన్ గా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది.

Dimple Hayathi
Dimple Hayathi

ప్రస్తుతం గోపీచంద్ తో శ్రీవాస్ చేస్తున్న మరో హ్యట్రిక్ మూవీలో ఈమెనే కథానాయికగా ఎన్నుకున్నారట. చిన్నదాని అసలు పేరు డింపుల్, న్యూమరాలజీ వల్ల హయతి అనే పదాన్ని జోడించిందట. ఇక మూవీస్ పరంగా కొంచెం పక్కన బెడితే అమ్మడికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువే ఉంటుంది. ఈమె పోస్టులన్నీ ప్రేక్షకులకు హీట్ పుట్టిస్తాయనడంలో సందేహం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here