Mahalakshmi: భర్తతో విడాకులు…ఒక్క పోస్ట్ తో క్లారిటీ ఇచ్చిన బుల్లితెర నటి మహాలక్ష్మి…

Mahalakshmi Ravinder Chandrasekar

Mahalakshmi: కోలీవుడ్ బుల్లితెర నటి మహాలక్ష్మి మరియు ప్రొడ్యూసర్ రవీంద్రన్ చంద్రశేఖరన్ ల పెళ్లి గత ఏడాది జరిగిన సంగతి అందరికి తెలిసిందే.అప్పట్లో వీరి వివాహం చర్చనీయాంశంగా కూడా మారింది.దీనికి కారణం కూడా అందరికి తెలిసిందే.మహాలక్ష్మి చూడడానికి ఎంతో స్లిమ్ గా అందంగా ఉంటారు.ఆమె భర్త భారీ కాయంతో ఉంటారు.అయితే వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోవడం అప్పట్లో అందరికి ఆశ్చర్యానికి గురి చేసింది.వీరిద్దరికి కూడా ఇది రెండో పెళ్లి.వీరి పెళ్లి జరిగిన వెంటనే సోషల్ మీడియాలో వీరి జంట పై ట్రోల్స్ జరిగాయి.మహాలక్ష్మి రవీందర్ ను డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేసారు.

Advertisement

రవీందర్ ను కూడా బాడీ షేమింగ్ చేస్తూ పోస్ట్లు పెట్టేవారు నెటిజన్లు.అయితే ఇవన్నీ పట్టించుకోని ఈ జంట హ్యాపీ గా తమ వివాహ జీవితాన్ని ఎంజాయ్ చేసేవారు.సోషల్ మీడియాలో కూడా ఎంతో ఆక్టివ్ గా ఉండే మహాలక్ష్మి తన భర్తతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేది.అయితే వీరిద్దరూ విడిపోతున్నారు అంటూ యూట్యూబ్ లో కొన్ని వార్తలు వినిపించాయి.

దానికి తోడు సోషల్ మీడియాలో ఈ జంట ఎలాంటి ఫోటోలు షేర్ చేసుకోకపోవడంతో ఈ వార్తలు నిజమే అంటూ ప్రచారం జరిగింది.అలాంటిదేమి లేదు అంటూ మహాలక్ష్మి తాజాగా ఒక్క ఫొటోతో అందరికి క్లారిటీ ఇవ్వడం జరిగింది.తాజాగా మహాలక్ష్మి తన భర్త తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఒక రొమాంటిక్ పోస్ట్ కూడా పెట్టింది.నువ్వు నా భుజం పై చేయి వేసినప్పుడు నేను ఈ ప్రపంచంలో ఏదైనా చేయగలను అన్న ధైర్యం వస్తుంది..మనసు నిండా నువ్వే అమ్ము..ఐ లవ్ యు..అని భర్త పై ప్రేమతో పోస్ట్ చేసింది మహాలక్ష్మి.ఈ పోస్టుకు ఆమె భర్త రవీందర్ కూడా లవ్ యు అంటూ రిప్లై చేసారు.ఈ పోస్ట్ తో తమ వైవాహిక బంధం పై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టారు ఈ జంట.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *