Actress Pragathi: తెలుగు సినిమా ప్రేక్షకులకు నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అమ్మ,అక్క,వదిన ఇలా క్యారక్టర్ ఆర్టిస్ట్ గా తన సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించింది నటి ప్రగతి.ఏ రోల్ ఇచ్చిన చాల అవలీలగా చేసే నటులలో ఈమె కూడా ఒకరు అని చెప్పచ్చు.సినిమాలలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ప్రగతి కి ప్రత్యేక ఫాలోయింగ్ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందని చెప్పచ్చు.ముఖ్యంగా ప్రగతి జిమ్ లో చేసే వర్క్ అవుట్ వీడియోలు,వెయిట్ లిఫ్టింగ్ వీడియోలు,ఫోటో షూట్స్,రీల్స్ వంటివి ప్రేక్షకులను విపరీతంగా కట్టుకుంటాయి.వాటికి మిలియన్స్ కొద్దీ వ్యూస్ వస్తూ ఉంటాయి.
ఆన్ స్క్రీన్ మీద అమ్మ పాత్రలు వదిన పాత్రలు చేసి ఎంతో సాఫ్ట్ గా కనిపించే ప్రగతి ఇంత హార్డ్ కొర్ వెయిట్ లిఫ్టర్ గా కనిపించడం చూసి అందరు ఆశ్చర్యపోతూ ఉంటారు.ప్రగతి సొంతంగా వీడియొ ఛానల్ పెట్టి తన పర్సనల్ మరియు ప్రొఫెషనల్ విషయాలను వీడియోలు చేసి అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ఫిట్ నెస్ కోసం ఈమె వెయిట్ లిఫ్ట్ చేస్తున్నారు అని అందరు అనుకుంటే ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్ గా ఈమె మారిపోయినట్లు పోస్ట్ చేసారు ప్రగతి.
కొత్త జర్నీ ప్రారంభం అయ్యింది..రెండు నెలల క్రితం నా జీవితం ఇంతలా మలుపు తిరుగుతుందని ఊహించలేదు.రెండు నెలల క్రితం ప్రారంభం అయినా ఈ ప్రయాణంలో ఇంకా చాల దూరం వెళ్లాల్సి ఉంది.నేను ఇది కూడా పూర్తి చేసి తీరుతాను.ప్రస్తుతం నా స్కోర్ 250 .టార్గెట్ చాల పెద్దది దాన్ని రీచ్ అయ్యే వరకు తగ్గేదేలే అంటూ ప్రగతి తానూ పవర్ లిఫ్టింగ్ చేస్తున్న వీడియోను షేర్ చేసారు.ఇక సినిమాల విషయానికి వస్తే ప్రగతి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.
View this post on Instagram