Actress Pragathi: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటి ప్రగతి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రగతి క్యారక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.తాజాగా ప్రగతి రెండో పెళ్లి చేసుకోబోతుంది అనే వార్త సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుంది.తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్ అయినా అతి కొద్దీ మంది క్యారక్టర్ ఆర్టిస్ట్ లలో ప్రగతి కూడా ఒకరు.హీరోయిన్ లకు తల్లి గా,వదినగా చాల సినిమాలలో ప్రగతి నటించారు.
అప్పట్లో ప్రగతి బాబీ సినిమాలో మహేష్ బాబు తల్లిగా,అలాగే చిరుత సినిమాలో హీరో రామ్ చరణ్ తల్లిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.తనకంటే పెద్ద హీరోలకు కూడా తల్లిగా నటించి మెప్పించింది ప్రగతి.కె.భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన వీట్ల విశేషం అనే సినిమాలో హీరోయిన్ గా ప్రగతి తన సినీ కెరీర్ ను స్టార్ట్ చేసింది.ప్రగతి తన భర్త తో విడిపోయి తన కూతురితో కలిసి జీవిస్తూ సింగిల్ మదర్ గా బ్రతుకుతుంది.ప్రగతి రెండో పెళ్లి పై తరుచు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
అయితే తాజాగా ఈమె రెండో పెళ్లి పై ఒక ఇంటరెస్టింగ్ వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ప్రగతి ఒక ప్రొడ్యూసర్ ను రెండో పెళ్లి చేసుకోబోతుంది అనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఆ ప్రొడ్యూసర్ చాల పద్దతిగా ప్రగతిని పెళ్లి చేసుకుంటాను అని మ్యారేజ్ ప్రపోసల్ పెట్టినట్లు సమాచారం.ఈ పెళ్ళికి ప్రగతి కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.ప్రతి ఒక్కరి జీవితంలో తోడు అవసరం కాబట్టి ప్రగతి కూడా ఈ పెళ్లి కి అంగీకరించినట్లు సమాచారం.ప్రగతి తెలుగుతో పాటు తమిళ్,మలయాళం సినిమాలలో కూడా నటిస్తుంది.సోషల్ మీడియాలో చాల ఆక్టివ్ గా ఉంటూ ప్రగతి తన వర్క్ అవుట్ వీడియోలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
View this post on Instagram