Roja Daughter: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోలు అయినా చిరంజీవి,బాలకృష్ణ,మోహన్ బాబు లకు జోడిగా నటించి స్టార్ హీరోయిన్ గా బాగా గుర్తింపు తెచ్చుకున్న నటి రోజా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈమె ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్ వైకాపా పార్టీలో నగరి నియోజక వర్గం నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈమె నగరి ఎమ్యెల్యే గా సేవలు అందిస్తున్నారు.
నటి రోజా భర్త సెల్వమణి గతంలో పలు సినిమాలకు డైరెక్టర్ గా,నిర్మాతగా,సహా నిర్మాతగా వ్యవహరించారు.అయితే ప్రస్తుతం సెల్వమణి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.ఈ దంపతులకు ఒక పాప,ఒక బాబు ఉన్నారు.పాప పేరు అన్షు మాలిక సెల్వమణి.చదువులో సరస్వతి అయినా అన్షు మాలిక అందంలో కుందనపు బొమ్మల ఉంటుంది అని చెప్పచ్చు.
అన్షు మాలిక సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను,వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు తల్లి మాదిరిగానే అందంగా ఉన్న అన్షు మాలిక సినిమాలలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం ఈమెకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.