Home సినిమా Vishwambhara: పదేళ్ల తర్వాత చిరంజీవి విశ్వంభర లో నటిస్తున్న ఆ ఇద్దరు హీరోయిన్ లు ఎవరో...

Vishwambhara: పదేళ్ల తర్వాత చిరంజీవి విశ్వంభర లో నటిస్తున్న ఆ ఇద్దరు హీరోయిన్ లు ఎవరో తెలుసా..!

0
Vishwambhara, Chiranjeevi, Surabhi, isha Chawla
Vishwambhara, Chiranjeevi, Surabhi, isha Chawla

Vishwambhara: వశిష్ట దర్శకత్వం లో చిరంజీవి( Chiranjeevi) విశ్వంబర సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసారు చిరంజీవి.ప్రస్తుతం చిరంజీవి అమెరికా లో ఉండడంతో ఈ సినిమాకు చిన్న గ్యాప్ ఇచ్చారు అని తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తున్నట్లు ఇప్పటికే గతం లో అధికారికంగా ప్రకటించారు.సోసియో ఫాంటసీ కథతో వస్తున్నా ఈ సినిమా మీద ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమాలో త్రిష తో పాటు మరో ఇద్దరు హీరోయిన్ లు కూడా నటిస్తున్నట్లు ఒక వార్త సోషల్ మీడియా లో వినిపిస్తుంది.హీరోయిన్ సురభి(Surabhi) మరియు ఇషా చావ్లా(isha Chawla) ను మరో రెండు ముఖ్య పాత్రల కోసం తీసుకుంటున్నట్లు ఒక వార్త వినిపిస్తుంది.చిరంజీవి తో ఈ ఇద్దరు హీరోయిన్లకు కాంబినేషన్ సీన్ లు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.

Vishwambhara Chiranjeevi Surabhi isha Chawla
Vishwambhara Chiranjeevi Surabhi isha Chawla

అయితే ఇషా చావ్లా తెలుగులో ప్రేమ కావాలి,పూల రంగడు,మిస్టర్ పెళ్లి కొడుకు వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించింది.సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఇషా చావ్లా సోషల్ మీడియా లో మాత్రం ఆక్టివ్ గా ఉంటుంది.అయితే దాదాపుగా పదేళ్ల తర్వాత ఇషా చావ్లా విశ్వంబర సినిమాతో టాలీవుడ్ లో రి ఎంట్రీ ఇవ్వనుంది.ఇక హీరోయిన్ సురభి బీరువా,ఎక్స్ప్రెస్ రాజా వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించింది.2019 లో శశి సినిమాలో చివరగా నటించింది.ఇషా చావ్లా,సురభి ఇద్దరు హీరోయిన్లు విశ్వంబర లో నటిస్తున్నట్లు ఇంకా అధికారిక ప్రకటన రావలసి ఉంది.

Also read : ప్రభాస్ ఒక్కో సినిమాకు తన డూప్ కు ఇచ్చే పారితోషకం ఎంతో తెలుసా..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here