Adipurush Closing Collections:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా ఇటీవలే థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే.ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా,కృతి సనాన్ సీతగా,సన్నీ సింగ్ లక్ష్మణుడిగా,సైఫ్ అలీ ఖాన్ రావణాసుడిగా నటించారు.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో ప్రేక్షకుల మధ్య రిలీజ్ అయ్యింది.టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా మొదటి మూడు రోజులు భారీగా వసూళ్లు రాబట్టింది.ఇక ఆ తర్వాత నుంచి కలెక్షన్లలో భారీగా పతనం మొదలైంది.ఇప్పటికి అన్ని ఏరియాలలో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ముగిసిందని సమాచారం.వరల్డ్ వైడ్ గా ఈ సినిమాలో పలు భాషలలో రిలీజ్ అవ్వడం జరిగింది.అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్ క్లోసింగ్ కలెక్షన్ ఎలా ఉన్నాయంటే.
మొదటిసారి ఈ సినిమా టీజర్ విడుదల అయినప్పుడే ఈ సినిమా ఏదో తేడా ఉండనే వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయి.వాల్మీకి రామాయణం తీశానంటూ ఈ సినిమా దర్శకుడు ఓం రౌత్ రామాయణాన్ని వక్రీకరించి తీయడంతో అటు రామ భక్తులతో పాటు ప్రేక్షకులు కూడా ఓం రౌత్ పై అసహనం వ్యక్తం చేసారు.ఈ సినిమా క్లైమాక్స్ లో కూడా రాముడు,రావణాసురుడు మధ్య ద్వంద్వ యుద్ధం పెట్టడం పై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.రామాయణంలో రాముడు రావణాసురుడు బాణాలతోనే యుద్ధం చేశారు కానీ ద్వంద్వ యుద్ధం చేయలేదు.దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాను తన ఇష్టమొచ్చినట్లు తెరకెక్కించారు.
దర్శకుడు ఈ సినిమా రామాయణం కాదు అంటూ చెప్పడం పై కూడా అందరు మంది పడుతున్నారు.అలా అయితే ఆదిపురుష్ సినిమా ప్రదర్శించే థియేటర్లలో హనుమంతుడి కోసం ఒక సీట్ కేటాయించమని ఎందుకు చెప్పినట్లు అంటూ అసహనం ప్రదర్శిస్తున్నారు ప్రేక్షకులు.మొదటి రోజు ఈ సినిమా యుఎస్ బాక్స్ ఆఫీస్ దగ్గర వన్ మిలియన్ యుఎస్ డాల్లర్స్ ను కలెక్ట్ చేసింది.ఇప్పటి వరకు ఈ సినిమా మూడు మిలియన్ల యుఎస్ డాలర్స్ ను కలెక్ట్ చేసిందని సమాచారం.మొదటి రోజు అంచనాలకు మించి భారీగా వసూళ్లు సాధించిన ఈ సినిమా రెండవ రోజు కూడా మంచి కలెక్షన్లు నమోదు చేసింది.ఇక ఆ తర్వాత నుంచే కలెక్షన్లలో పతనం మొదలయ్యింది.తెలుగులో ఈ సినిమాను రూ.50 కోట్లకు అమ్మారు.ఓవరాల్ గా ఈ సినిమా రూ.38 .40 కోట్లు షేర్లు రాబట్టింది.రూ.11 .10 కోట్ల నష్టాలను ఈ సినిమా తీసుకొచ్చింది.