అదిరిపోయిన ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్…

NEWS DESK
1 Min Read

ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ ఇటీవలే తాజాగా భారత్ లోని అన్ని థియేటర్లలో విడుదల చేసారు.ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ తో ఈ సినిమా ట్రైలర్ మొదలవుతుంది.ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ తో ప్రపంచంలోని ప్రమాదకరమైన శత్రువు ఎవరో తెలుసా..నీ గురించి అంతా తెలిసిన వాడు నీ శత్రువు ఈ ట్రైలర్ మొదలవుతుంది.ప్రకాష్ రాజ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ లను కూడా ఈ ట్రైలర్ లో గమనించవచ్చు.ఈ ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా సినిమాపై భారీ అంచనాలను పెంచేలా ఉంది.

ప్రపంచవ్యాప్తంగా బాహుబలి సినిమాతో సరికొత్త గ్రాఫిక్స్ ను చూపించిన రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో మరో సారి గ్రాఫిక్స్ విషయంలో తనకు తానె సాటి అంటూ నిరూపించుకున్నారు.ఈ ట్రైలర్ లో రామ్ చరణ్,ఎన్టీఆర్ కూడా సిక్స్ పాక్స్ తో కనువిందు చేస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం జనవరి 7 న విడుదలకు సిద్ధంగా ఉంది.గురువారం ఉదయం పది గంటలకు ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కావడం జరిగింది.ఆ తర్వాత యు ట్యూబ్ లో కూడా ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.దాదాపు ఈ ట్రైలర్ మూడు నిముషాలు ఉన్నట్లు సమాచారం.ప్రపంచవ్యాప్తంగా 200 థియేటర్లలో గ్రాండ్ గా ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ ను విడుదల చేసారు చిత్ర యూనిట్.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ట్రైలర్ ఉందని చాల మంది చెప్తున్నారు.ఈ ట్రైలర్ తో సినిమా మీద ప్రేక్షకులకు భారీగానే అంచనాలు నెలకొన్నాయి అని చెప్పచ్చు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *