Aditi Rao Hydari: ఈ ఫొటోలో క్యూట్ స్మైల్ తో హోయలొలుకుతూ ఆకట్టుకులా ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా స్టార్ హీరోయిన్, మంచి అభినయం, అదంతో వెండితెరపై దూసుకుపోతూ తనకంటూ మంచి ఇమేజ్ తెచ్చకుంది. ప్రస్తుతం కొనసాగుతున్న సోషల్ మీడియా జమానాలో సెలబ్రిటీలు కొత్త పంతాను అవలంభిస్తున్నారు. ఇంటర్నెట్ పుణ్యమా తన పెట్టే ఒక్కో పోస్టుకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరుగుతుండడంతో కొత్త కొత్త పిక్స్ పోస్ట్ చేస్తూ అభిమానులను మరింత అలరిస్తున్నారు.

ఫ్యామిలీ, ప్రొఫెసన్ విషయాలను బాహాటంగానే నెటిజన్లతో పంచుకుంటున్నారు. సోషల్ మీడియాలో ‘త్రో బ్యాక్ పిక్స్’ ట్రెండ్ విపరీతంగా కొనసాగుతోంది. నటులు తమ చిన్ననాటి ఫొటోలను ఉంచి ‘అప్పుడలా.. ఇప్పుడిలా’ అంటూ తన అనుభూతులను పంచుకుంటున్నారు. హీరో, హీరోయిన్లు తమ బర్త్ డే ఫొటోలను ఫేస్ బుక్, ఇన్ స్టా, ట్విటర్ వేదికగా పోస్ట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ త్రో బ్యాక్ పిక్ వైరల్ అవుతోంది. ఆ చిన్నారి తెలంగాణ భామనే. సౌత్ లో నార్త్ లో మంచి మంచి సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను పెంచుకుంటూ పోతోంది. ఇప్పటికైనా ఆమె ఎవరో గుర్తు పట్టారా..?

ఆమె ఎవరో కాదు అదితీ రావు హైదరి. మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన ‘చెలియా’తో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ భామ. ‘సమ్మోహనం’తో అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకుంది. తర్వాత వరుణ్ తేజ్ సరసన ‘అంతరిక్షం’లో అలరించింది. నానితో ‘వి’, శెర్వానంద్ తో ‘మహా సముద్రం’, దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్ తో కలిసి ‘హే అనామిక’ మూవీస్ లో నటించింంది.

తన కెరీర్ ప్రారంభంలోనే బాలీవుడ్ లో మంచి ఫేమ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తమిళం, కన్నడ, తెలుగు, మళయాలం, తదితర భాషల్లో చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన హైదరీ వనపర్తి సంస్థానాన్ని పాలించాట.