Home సినిమా ఎయిర్ పోర్ట్ లో అరబిక్ కుతూ సాంగ్ కు అద్భుతంగా స్టెప్పులు వేసిన సమంత….వీడియొ చూసి...

ఎయిర్ పోర్ట్ లో అరబిక్ కుతూ సాంగ్ కు అద్భుతంగా స్టెప్పులు వేసిన సమంత….వీడియొ చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు….

0

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాల సాంగ్స్ వైరల్ అవుతున్నాయి.సినిమాలలో చాల ఫేమస్ అయినా పాటలు లేక చాల బాగున్నా పాటలు మ్యూజిక్ ను షార్ట్ గా కట్ చేసి స్టెప్పులు వేయడంతో అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇలాంటి పాటలకు సామాన్యుల నుంచి సెలెబ్రెటీలు మరియు స్టార్లు కూడా డాన్స్ చేస్తున్నారు.ఇలా సెలెబ్రెటీలు చేసిన డాన్స్ వీడియోలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.ఇటీవలే తాజాగా బీస్ట్ అనే సినిమా నుంచి అరబిక్ కుతూ సాంగ్ రిలీజ్ అయ్యింది.బాగా ఫేమస్ అయినా ఈ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

ఈ చిత్రంలో విజయ్,పూజ హెగ్డే హీరో హీరోయిన్ లుగా నటించడం జరిగింది.అనిరుద్ మ్యూజిక్ అందించిన ఈ పాటకు శివ కార్తికేయన్ లిరిక్స్ అందించారు.ప్రస్తుతం యు ట్యూబ్ లో ట్రెండింగ్లో ఉన్న ఈ పాటకు సామాన్యుల నుంచి సెలెబ్రెటీల వరకు స్టెప్పులు వేస్తూ అలరిస్తున్నారు.తాజాగా స్టార్ హీరోయిన్ సమంత కూడా అరబిక్ కుతూ సాంగ్ కు స్టెప్పులు వేసిన వీడియొ ను సామజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం జరిగింది.

ఎయిర్ పోర్ట్ లో ఫ్లైట్ కు ఇంకా టైం ఉండడంతో ఎవరు లేని ప్లేస్ లో అరబిక్ కుతూ పాటకు స్టెప్పులు వేసింది సమంత.ఈ వీడియోను పోస్ట్ చేస్తూ సమంత రాత్రి పూట ఫ్లైట్ కోసం చూస్తూ ఈ రిథమ్ కి డాన్స్ చేశాను అంటూ విజయ్,పూజ హెగ్డే,అనిరుద్..ఇంకా ఈ సినిమాకు సంబంధించిన వాళ్ళను ట్యాగ్ చేసింది.పూజ హెగ్డే కూడా ఈ వీడియోను తన స్టోరీలో షేర్ చేసారు.అభిమానులు,సెలెబ్రెటీలు అందరు కూడా సమంత అద్భుతంగా డాన్స్ చేసారు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here