Home సినిమా మూడో వారంలో కూడా దుమ్ము రేపిన అఖండ..3 వీక్స్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…

మూడో వారంలో కూడా దుమ్ము రేపిన అఖండ..3 వీక్స్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…

0

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అఖండ డిసెంబర్ 2 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.రిలీజ్ అయ్యి మూడు వారలు అయినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్య జైస్వాల్ నటించారు.హీరో శ్రీకాంత్,జగపతి బాబు,పూర్ణ ముఖ్య పాత్రలలో కనిపించారు.ఈ సినిమా రిలీజ్ అయినా పది రోజుల్లోనే రూ.100 కోట్ల షేర్లు రాబట్టి వంద కోట్ల క్లబ్ లో చేరింది.

ఇక అఖండ మూడు వారల కలెక్షన్స్ ఇలా ఉన్నాయి..నైజాం:19 .23 cr ,సీడెడ్:14 .62 cr ,ఉత్తరాంధ్ర:5 .95 cr ,ఈస్ట్:4 .0 cr ,వెస్ట్:3 .88 cr ,గుంటూరు:4 .56 cr ,కృష్ణ:3 .46 cr ,నెల్లూరు:2 .51 cr ,ap మరియు తెలంగాణ:58 .21 cr ,రెస్ట్:4 .85 cr ,ఓవర్సీస్:5 .62 cr ,వరల్డ్ వైడ్ మొత్తం:68 .68 cr .ఈ సినిమా బరిలోకి 54 కోట్ల టార్గెట్ తో దిగింది.అయితే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసి 14 .68 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది.

ఈ సినిమాకు సంబంధించి హిందీ దుబ్బింగ్ రైట్స్ కూడా ఒక రేంజ్ లో అమ్ముడుపోయాయని సమాచారం.హిందీ దుబ్బింగ్ రైట్స్ నుంచి 20 కోట్లు ఆదాయం అందిందని వార్తలు వస్తున్నాయి.అఖండ చిత్రం హిందీ లో కూడా రీమేక్ చేయనున్నారట.హిందీ లో అజయ్ దేవగన్ లేక అక్షయ్ కుమార్ హీరోగా చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.మరో వైపు ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను డిస్నీ హాట్ స్టార్,స్టార్ సొంతం చేసుకున్నట్లు అధికారికంగా చిత్ర బృందం ప్రకటించటం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here