బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం అఖండ ఇటీవలే రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే.ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం డిసెంబర్ 2 న విడుదల అయ్యింది.ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల పంట పండిస్తుందనే చెప్పాలి.ఈ చిత్రానికి తమన్ అందించిన మ్యూజిక్ కూడా సినిమాకు హైలెట్ గా ఉందని చెప్పచ్చు.
ప్రగ్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించడం జరిగింది.వీకెండ్ రోజులలో కూడా ఈ చిత్రం భారీ కలెక్షన్లను రాబట్టింది.ఈ ఆరు రోజులలో అఖండ కలెక్షన్లు చూసుకుంటే బ్రేక్ ఈవెన్ కు ఇంకా కొద్దీ దూరంలో మాత్రం ఉంది.ఈ ఆరు రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి..
నైజం:11 .40 cr ,సీడెడ్:10 .55 cr ,ఉత్తరాంధ్ర:4 .41 cr ,ఈస్ట్:2 .94 cr ,వెస్ట్:2 .36 cr ,గుంటూరు:3 .62 cr ,కృష్ణ:2 .63 cr ,నెల్లూరు:1 .78 cr ,ఏపీ,తెలంగాణ కలిపి:42 .8 cr ,రెస్ట్ అఫ్ ఇండియా మరియు ఓవర్సీస్:8 .7 cr ,వరల్డ్ వైడ్ మొత్తం:51 .50 cr .ఈ చిత్రానికి రూ.53 .25 కోట్లు థియరిటికల్ బిసినెస్ జరిగింది.బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.54 కోట్ల షేర్లు రావాలి.ఇప్పటి వరకు 51 .50 షేర్లు రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కు ఇంకా 2 .5 కోట్లు షేర్ రావలిసి ఉంది.