అఖండ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన ఆ నాలుగు స్టార్ హీరోయిన్లు వీళ్ళే..

బోయపాటి శ్రీను,బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం అఖండ డిసెంబర్ 2 న విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది.తోలి నాలుగు రోజులకే ఈ చిత్రం రూ.44 కోట్ల షేర్లు రాబట్టి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.ఈ చిత్రం లో బాలయ్య ద్విపాత్రాభినయం చేసారు.అందులో అఘోర పాత్రలో బాలకృష్ణ మాస్ ప్రేక్షకులకు బాగా ఆకట్టుకున్నారు.అయితే ఈ సినిమాలో అఘోర క్యారెక్టర్ కు హీరోయిన్ అవసరం ఉండదు.కానీ బాలయ్య ఇంకో పాత్ర కోసం ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ ఉంటుంది.

అయితే ఆ హీరోయిన్ పాత్ర ఫస్ట్ హాఫ్ వరకే అయినా కూడా ఒక రెండు పాటలకే పరిమితం అయినా కూడా బాలయ్య పక్కన హీరోయిన్ గా ముఖ్య పాత్రలో నటించడానికి ముందు బోయపాటి చాల మంది హీరోయిన్ లను సంప్రదించారట.ఒక కలెక్టర్ గా మరియు మురళి కృష్ణ భార్య గా ప్రగ్య జైస్వాల్ బాగానే ఆకట్టుకుంది.అయితే ఈ సినిమాలో బాలయ్యను దృష్టిలో పెట్టుకొని స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుందని ముందుగా కాజల్ అగర్వాల్,రకుల్ ప్రీత్ సింగ్,పాయల్ రాజ్ పుత్,కేథరిన్ హీరోయిన్ లను సంప్రదించారట దర్శకుడు.

బోయపాటి శ్రీను మరియు బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చే హ్యాట్రిక్ సినిమా అంటే ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఉంటాయి.వాటిని దృష్టిలో పెట్టుకొని బోయపాటి పెద్ద హీరోయిన్ అయితే బాగుంటుంది అని పరితపించారట.కానీ వాళ్ళందరూ కొన్ని కారణాల వలన నో చెప్పడం తో ప్రగ్య జైస్వాల్ ను ఫైనల్ చేసారు దర్శకుడు.అయితే అఖండ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సంగతి అందరికి తెలిసిందే.ఇందులో ప్రగ్య పాత్రకు కూడా మంచి స్పందన వస్తుంది ప్రేక్షకుల నుంచి.మరి ఈ బ్లాక్ బస్టర్ విజయం ప్రగ్య కు కలిసి వస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *